S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/19/2017 - 01:33

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 8684 గ్రామాల మ్యాప్‌లను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. భూపరిపాలన శాఖ (సిసిఎల్‌ఏ) ఈ బృహత్తర కార్యక్రమాన్ని రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సహాయంతో చేపట్టింది. వచ్చే 15 రోజుల్లో డిజిటలైజేషన్ చేసిన గ్రామాల మ్యాప్‌లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.

06/19/2017 - 01:28

హైదరాబాద్, జూన్ 18: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న కేసులు కుకుట్‌పల్లి, బాలానగర్, మేడ్చెల్ సబ్ రిజిస్ట్రేషన్లకు పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు మొత్తం 183 కేసులు నమోదయ్యాయి. ఇందులో 90 శాతం కేసులో పాత రంగారెడ్డి జిల్లాలో ఉండడం విశేషం.

06/18/2017 - 02:58

హైదరాబాద్, జూన్ 17: రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ప్రతిపాదించిన కొత్త కలెక్టరేట్ల కాంప్లెక్స్‌లను ఏడాదిలోగా పూర్తి చేయాలని రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. జాతీయ నిర్మాణ అకాడమీ (నాక్) భవనంలో ఆర్ అండ్ బితో పాటు వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. కలెక్టరేట్ల భవనాల డిజైన్లను ఇప్పటికే ఖరారు చేశామని, నిధులు కూడా విడుదల చేశామని వివరించారు.

06/18/2017 - 02:57

హైదరాబాద్, జూన్ 17: కొత్తగా అమలులోకి వచ్చే వస్తు సేవల పన్ను విధానం(జిఎస్‌టి)తో పన్నుల వ్యవస్థలో పెనుమార్పులు సంభవించి దేశ ఆర్థిక గతి మారిపోతుందని కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీసు టాక్స్ చీఫ్ కమిషనర్ సందీప్ ఎం భట్నాగర్ అన్నారు. జిఎస్‌టి అమలులోకి వస్తే ప్రజల్లో ఉన్న అపోహలు తొలగి చెల్లింపులు సులభతరం అవుతాయని అన్నారు. జిఎస్‌టి అమలులో దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని అన్నారు.

06/18/2017 - 02:55

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూన్ 17: రాజధానిలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సిబిఐచే విచారణ జరిపించాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జెఎసి ఆధ్వర్యంలో ‘మియాపూర్ భూ కుంభకోణం’పై పలువురు సీనియర్ న్యాయ నిపుణుల సమక్షణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

06/18/2017 - 02:50

హైదరాబాద్, జూన్ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులంతా సహకారం అందించాలని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాద్ (రాజేంద్రనగర్) లోని సిపార్డ్‌లో మంత్రి శనివారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

06/18/2017 - 02:45

హైదరాబాద్, జూన్ 17: దేవాలయాల ఆర్చకులకు, ఉద్యోగస్తులకు ప్రి నెలా క్రమం తప్పకుండా బ్యాంకులో వేతనం జమ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చిన్న మోహన్, ఉపాధ్యక్షుడు భాస్కరపల్లి రామశర్మ తదితరులు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. జీతాలకు సంబంధించి వినతిపత్రం అందజేశారు.

06/18/2017 - 02:43

హైదరాబాద్, జూన్ 17: హైదరాబాద్‌లో సరోగసి కలకలం సృష్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అద్దె గర్భం ద్వారా పిల్లలను జన్మనిచ్చేందుకు సహకరిస్తున్న బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఆసుపత్రిలోని రికార్డులు స్వాధీనం చేసుకుని, ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు వైద్యశాఖ అధికారులు, నలుగురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

06/18/2017 - 02:40

హైదరాబాద్, జూన్ 17: రాష్ట్ర మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లపై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరుతూ, శనివారం మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, అంబేద్కర్‌నగర్‌వాసులు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హుస్సేన్ సాగర్ లేక్ ఆనుకుని ఉన్న అంబేద్కర్‌నగర్‌వాసుల ఇళ్ళను ఖాళీ చేయించి, ఆ స్థలంలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారని శశిధర్‌రెడ్డి ఆరోపించారు.

06/18/2017 - 02:40

హైదరాబాద్/శంషాబాద్, జూన్ 17: భూ రాబందు గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ అమ్ముడు పోయారని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టులో మియాపూర్ భూ కుంభకోణం కేసులో నిందితులకు బెయిల్ మంజూరు సమయంలో ప్రభుత్వం తరఫున వాదించడానికి న్యాయవాదులను ప్రభుత్వం పంపించలేదని అన్నారు. అలాగే అడ్వకేట్ జనరల్ కూడా విచారణకు గైర్హాజరయ్యారని తెలిపారు.

Pages