S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/05/2016 - 15:56

హైదరాబాద్: క్రిమిలేయర్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ అంశంపై త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలువనున్నట్లు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శుక్రవారం తెలిపారు. 27 శాతం రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన బీసీ సంఘాలకు సూచించారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో మంచి ఫ్యాకల్టీ, డైరెక్టర్ లేక సిలబస్ పూర్తి కాలేదని విమర్శించారు.

08/05/2016 - 15:18

హైదరాబాద్: ఏడాది నుంచి సకాలంలో జీతాలు అందడం లేదని, విశ్రాంత ప్రొఫెసర్లకు పెన్షన్లు అందడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పారు. వేతనాలు చెల్లించడం లేదని ఓయూ పరిపాలనా భవన్ ఎదుట శుక్రవారం వారు ధర్నా నిర్వహించారు. అలవెన్స్‌లు ఇవ్వడం లేదని, ఈ నెల ఇంకా వేతనాలు అందలేదని, ఇదే కొనసాగితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఓయూ ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

08/05/2016 - 15:07

హైదరాబాద్: నాగోల్‌ బండ్లగూడలో రాజీవ్‌ స్వగృహ ప్లాట్లను, బండ్లగూడ, పోచారంలో ఉన్న 5వేల ప్లాట్లను విక్రయించాలని గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ఆ పాట్ల బహిరంగ వేలం ఆగస్టు 7 నుంచి 17 వరకు ఉంటుందని తెలిపారు. నాగోల్‌ బండ్లగూడలో రాజీవ్‌ స్వగృహ ప్లాట్లను మంత్రి పరిశీలించారు.

08/05/2016 - 14:30

హైదరాబాద్: ఏపీ ఉద్యోగులకు సహచర తెలంగాణ ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సచివాలయంలో గురువారం ఇరురాష్ట్రాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

08/05/2016 - 14:29

హైదరాబాద్: జీవో 123పై తీర్పును హైకోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్‌ సోమవారానికి వాయిదా వేసింది. జీవో 123ను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. షెడ్యూల్‌ 2 ప్రకారం రైతులు, రైతు కూలీలకు న్యాయం చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. జీవోపై విధివిధానాలు రూపొందించుకుని రావాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

08/05/2016 - 14:27

మెదక్‌: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా గజ్వేల్‌‌ సభలో 2లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామని, సభా వేదికపై 18 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సభా ప్రాంగణంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ప్రధాని పర్యటన కోసం 4 హెలీప్యాడ్లు సిద్ధం చేశామని చెప్పారు. ఐదు కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు.

08/05/2016 - 14:24

హైదరాబాద్ : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ స్టడీ సర్కిల్‌లో శుక్రవారం కూడా విద్యార్థుల దీక్షలు కొనసాగాయి. నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను గురువారం అరెస్టు చేసినప్పటికీ దీక్షలను కొనసాగిస్తున్నారు. స్టడీ సర్కిల్ ఆవరణలో షామియానాలు వేసేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో విద్యార్థులు ఎండలోనే దీక్షలు చేపట్టారు.

08/05/2016 - 14:23

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలంగాణ సర్కారు అడ్డగోలుగా భూసేకరణ జరుపుతోందని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని టి.టిడిపి నేతలు శుక్రవారం ఇక్కడ గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. భూసేకరణకు సంబంధించి 123 జీవోను హైకోర్టు కొట్టివేసినప్పటికీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడం తగదన్నారు.

08/05/2016 - 12:16

హైదరాబాద్: భూసేకరణకు సంబంధించి ఇచ్చిన 123 జీవోను హైకోర్టులోని సింగిల్ జడ్డి కొట్టివేయడంతో డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ ఈరోజు విచారణకు స్వీకరించింది.

08/05/2016 - 12:15

హైదరాబాద్: జిహెచ్‌ఎంసిలో ఖైరతాబాద్ సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్‌కు చెందిన ఇళ్లపై శుక్రవారం ఉదయం ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ఇంతవరకూ కోటి రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించి సోదాలు కొనసాగిస్తున్నారు. డిడి కాలనీ, అల్వాల్, గుడిమల్కాపూర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో సంతోష్‌కు స్థిరాస్తులున్నట్లు గుర్తించారు.

Pages