S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/24/2016 - 08:13

హైదరాబాద్: తెలంగాణ వాణిజ్య శాఖ ఆదాయం గణనీయంగా పెరగడంతో ఆ శాఖను, చెక్‌పోస్టులను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య శాఖ రాబడి రూ.33 వేల కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో వ్యాట్, వాణిజ్య శాఖ పన్నులు కలిపి రూ. 22,834.54 కోట్లు, 2015-16 ఫిబ్రవరి వరకు రూ. 26,972.13 కోట్ల ఆదాయం వచ్చింది.

03/24/2016 - 08:05

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి బుధవారం వసంతమాడి పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. ఏప్రిల్ 15వ తేదీన జరిగే కల్యాణానికి రాముడు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామికి వేడుకగా అభిషేకం చేసి వివిధ మంజీరాలతో వసంతోత్సవం చేశారు. అనంతరం స్వామిని పెళ్లికొడుకును చేశారు. శ్రీసీతారాముల కల్యాణం పెళ్లి పనులను లాంఛనంగా వైదిక కమిటీ ప్రారంభించింది.

03/24/2016 - 08:04

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ ఆయా వర్గాల అవసరాలకు ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్నార్థకం. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బిసి సంక్షేమ శాఖకు రూ.2537.51 కోట్లు కేటాయింపును బడ్జెట్‌లో పొందుపరుస్తూ ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టారు. బిసిల సంక్షేమానికి పెద్ద పీట వేసామంటున్న ప్రభుత్వం ఆ స్థాయిలో భారీ కేటాయింపులు జరగలేదని ఆయా వర్గాలు విశే్లషిస్తున్నాయి.

03/24/2016 - 08:03

సంగారెడ్డి: కాపలా లేకుండా ఏర్పాటు చేసిన ఎటిఎంలను గుర్తు తెలియని దొంగలు మరోమారు లక్ష్యంగా చేసుకుని లూటీకి పాల్పడ్డారు. రామాయంపేట మండలం నిజాంపేట, పుల్కల్ మండలం శివ్వంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇండిక్యాష్ ఎటిఎంలపై దొంగలు విరుచుకుపడ్డారు. గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేసి నగదును అపహరించుకుపోవడం గమనార్హం.

03/24/2016 - 08:02

హైదరాబాద్: తెలంగాణలో షాదీ ముబారక్ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. రాష్టవ్య్రాప్తంగా షాదీముబారక్‌పై ఏసిబి నిఘా వేసింది. పలు జిల్లా కేంద్రాల్లోని మైనార్టీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. బుధవారం 20కి పైగా కేసులు నమోదు చేసింది. ఏసిబి, సౌత్ జోన్ పోలీసుల సంయుక్త్ధ్వార్యంలో పాతబస్తీలోని ఓ మీ-సేవ కార్యాలయంలో తనిఖీ చేయగా కుంభకోణం వెలుగుచూసింది.

03/24/2016 - 08:01

హైదరాబాద్: ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే అరెస్టు చేయాలని, ఆ పదవి నుంచి డిస్మిస్ చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి కేసు ఎదుర్కొంటున్న విసి అప్పారావును అరెస్టు చేయకుండా, తిరిగి ఆయనకు విసిగా అవకాశం ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు.

03/24/2016 - 06:47

ఎండలు మండిపోతున్నాయ. అధిక ఉషోణ్రగతలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయ. నిత్యం బిజీగావుండే బంజారాహిల్స్ మెయన్ రోడ్డు బుధవారం ఎండదెబ్బకు ఇలా నిర్మానుష్యంగా మారింది.

03/24/2016 - 06:45

హైదరాబాద్: ‘తెలంగాణ జీవోల వెబ్‌సైట్ పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడుతుంది?’ అని హైదరాబాద్ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్ని రోజుల్లో పునరుద్ధరిస్తారో కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

03/24/2016 - 06:42

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో ఆర్ట్స్ కళాశాల వెనుక గల నీటి ట్యాంకులో ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. బుధవారం ఉదయం గమనించిన సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. అయితే మృతుడు నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావిస్తూ ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్‌తోనే చనిపోయాడంటూ విద్యార్థులు ఆరోపించారు.

03/24/2016 - 06:31

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల వేదనను వినే పరిస్థితిలో లేదని జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. దేశంలో సామాజిక న్యాయం కలగానే మిలిగిపోతోందని దానిని సాధించేందుకే పోరు సాగిస్తున్నామని అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కన్హయ్యకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది.

Pages