S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/02/2019 - 22:57

హైదరాబాద్, మే 2: ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్తగూడెం, రామగుండం థర్మల్ కేంద్రాల్లో ఏబీసీ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలన్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరో ఐదేళ్ళు పొడిగించాలని విద్యుత్ యూనియన్ కార్మికులు యాజమాన్యాన్ని కోరారు. గురువారం విద్యుత్ సౌధలో ట్రాన్స్, జెన్‌కో డైరెక్టర్‌కు యూనియన్ నేతలు వినతిపత్రం అందచేశారు.

05/02/2019 - 17:23

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని, పరీక్షా లోపాలను సవరించాలని కోరుతూ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి యత్నించారు. ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు నినదించారు. కాగా నాయకులను అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

05/02/2019 - 12:59

హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో లోపాలను నిరసిస్తు, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ ఇచ్చిన తెలంగాణ బంద్ పాక్షికంగా జరిగింది. బీజేపీ నేతలను ఉదయమే హౌజ్ అరెస్టు చేశారు. ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ల్లో బస్సులను ఆందోళనకారులు నిలిపివేశారు. అలాగే పలుచోట్ల డిపోల ఎదుట పార్టీ కార్యకర్తలు బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.

05/02/2019 - 12:56

హైదరాబాద్: చార్మినార్‌లోని ఓ మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ జనసంచారం లేకపోవటంతో ప్రమాదం తప్పింది.

05/02/2019 - 03:34

హైదరాబాద్, మే 1: గ్లోబరీనా ఒప్పందంతో కేటీఆర్‌కు సంబంధం ఉందని ఆరోపించిన కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి 24 గంటలలో క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. గ్లోబరీనాకు ఐటీ శాఖకు సంబంధం ఏమిటని నిలదీశారు. ఆ ఒప్పందం జరిగినప్పుడు విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరి ఉన్నారని సుమన్ గుర్తు చేశారు. ఈ అంశం పూర్తిగా విద్యాశాఖకు సంబంధించిన విషయమన్నారు.

05/02/2019 - 03:31

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే జూలై 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఈ పాస్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ చెప్పారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ పాస్ ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు.

05/02/2019 - 03:27

చిత్రం... అవంతినగరంలోని సుభాషణ్‌రెడ్డి నివాస గృహానికి వెళ్లి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు

05/02/2019 - 03:21

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు , వాటి అనుబంధ సంస్థలు కార్మిక దినోత్సవాన్ని బుధవారం నాడు వేడుకగా నిర్వహించాయి. సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఎంలు వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో కార్మికుల హక్కులకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి.

05/02/2019 - 02:58

హైదరాబాద్, మే 1: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఈ నెల 2వ తేదీన గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ప్రజలు మద్దతు తెలియచేయాలని, 24 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ సమర్థ పాలకుల నేత చిక్కడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు.

05/02/2019 - 02:58

నిజామాబాద్, మే 1: సుదీర్ఘకాలం నుండి అపరిష్కృతంగానే ఉండిపోతున్న తమ సమస్యలను దేశ వ్యాప్తంగా అందరి దృష్టికి తేవాలన్న వ్యూహంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత పసుపు రైతులు చేపట్టిన వారణాసి యాత్ర వృథా ప్రయాసగానే మిగిలింది.

Pages