S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/03/2019 - 21:56

బిజినేపల్లి, మే 3: ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడం ఎన్నికల తరువాత మరిచిపోవడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు వీ. హన్మంత్‌రావు అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా మండలంలోని గంగారంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మండలంలోని మార్కెండేయ చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామనే వాగ్దానం చేసి ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

05/03/2019 - 12:47

హైదరాబాద్: ప్రముఖ నటుడు చిరంజీవి నటిస్తున్న సైరా సెట్‌లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట శివారులో ఉన్న చిరంజీవి ఫామ్‌హౌజ్‌లో సెట్ వేసి సినిమా చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున దట్టమైన పొగ, మంటలు రావటంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు.

05/03/2019 - 04:41

హైదరాబాద్, మే 2: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలయ్యామనే ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడిన 23 మంది బాలికలకు అఖిల పక్ష నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ట్యాంక్‌బండ్‌పై క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు. అయితే ముందస్తు అనుమతి లేదనే ఆరోపణలతో అఖిల పక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

05/03/2019 - 04:28

ఖమ్మం, మే 2: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లోప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరిట పర్యటిస్తున్న కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాలలో పర్యటించిన ఆయన బుధవారం రాత్రి కొత్తగూడెంలో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

05/03/2019 - 04:26

హైదరాబాద్, మే 2: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినట్టు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. పదో తరగతికి సంబంధించి మే 6న జరగాల్సిన పరీక్ష మే 16న, మే 7న జరగాల్సిన పరీక్ష మే 17న, మే 8న జరగాల్సిన పరీక్ష మే 18న, మే 9న జరగాల్సిన పరీక్ష మే 20న జరుగుతాయి.

05/03/2019 - 04:25

హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశానికి ఒకే దరఖాస్తు ద్వారా అడ్మిషన్లు చేపట్టే ‘దోస్త్’ ఆన్ లైన్ విధానాన్ని విజయవంతంగా మూడో ఏడాది నిర్వహించబోతున్నట్టు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.

05/03/2019 - 04:42

హైదరాబాద్, మే 2: ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ గురువారం ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుప్రశాంతంగా ముగిసింది. కాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. బంద్ సందర్భంగా హైదరాబాద్‌లో రెండు వేల మంది పోలీసులు అరెస్టు చేశారు.

05/03/2019 - 04:19

హైదరాబాద్, మే 2: జూలై నుంచి ఐదవ విడత హరితహారాన్ని ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం ప్రతీ గ్రామంలో ప్రత్యేకంగా నర్సీరీలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ఈ నర్సరీలకు ఆయా గ్రామ హరితహారంగా నామకరణం చేయాలని సూచించింది.

05/03/2019 - 04:16

హైదరాబాద్, మే 2: కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావును టీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ‘బఫూన్’ అని
దూషించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురువారం అంబర్‌పేటలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా సేవలు అందించిన వీహెచ్ లాంటి సీనియర్ నేతను కేటీఆర్ పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు

05/03/2019 - 04:45

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రవేశపరీక్షలకూ నిమిషం నిబంధన వర్తిస్తుందని, వేళ దాటితే పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని మరో మారు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. విద్యార్థుల నుండి వస్తున్న వత్తిడి దృష్ట్యా కొన్ని పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా గతంలో అనుమతించామని, ఈసారి అలాంటి రాయితీలు ఉండవని పేర్కొంది.

Pages