S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/03/2019 - 02:21

హైదరాబాద్, మే 2: వివిధ శాఖల ఆధ్వర్యంలో పని చేస్తున్న రాష్టస్థ్రాయి శిక్షణా సంస్థలు, అకాడమీలను మరింత మెరుగు, బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. సచివాలయంలో గురువారం రాష్టస్థ్రాయి శిక్షణా సంస్థల పనితీరుపై జోషి సమీక్షించారు.

05/03/2019 - 02:20

హైదరాబాద్, మే 2: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో అమలుచేస్తున్న చాయిస్ బేస్డు క్రెడిట్ సిస్టంలో ఈ ఏడాది నుండి భారీ మార్పులు తెస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి చెప్పారు. ఇప్పటికే సీబీసీఎస్‌ను అమలు చేసి మూడేళ్లు గడచిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించి కొత్త మార్పులు తెస్తామని అన్నారు.

05/02/2019 - 23:11

సిద్దిపేట, మే 2: సిద్దిపేట జిల్లా పరిధిలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో గురువారం పోలీసు పహారాలో పనులు జరుగుతున్నాయి. ఏటిగడ్డకిష్టాపూర్‌లో బుధవారం జేసీబీలతో చేపట్టిన పనులను గ్రామస్థులను అడ్డుకోవటంతో ఉద్రిక్తతకు దారితీసింది. మల్లన్నసాగర్ నిర్మాణంతో తాము అన్ని కోల్పోతున్నాయి.

05/02/2019 - 23:08

భూపాలపల్లి, మే 2: ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ను వీడడం జిల్లా ప్రజల అదృష్టమని మాజీ మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆమె గురువారం జిల్లా కేంద్రమైన భూపాలపల్లి రూరల్ పరిధిలోని ఆజంనగర్, నాగారం తదితర గ్రామాల్లో కాంగ్రెస్ నుండి బరిలో నిలిచిన జడ్పీటీసీ దూడపాక శోభ శంకర్ గెలుపును కాంక్షిస్తూ ఆమె ప్రచారం నిర్వహించారు.

05/02/2019 - 23:06

రామగిరి, మే 2: ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉసురు తగిలి సీఎం కేసీఆర్ పాపం పండుతుందని మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా నల్లగొండ మండల జడ్పీటీసీ అభ్యర్థి వంగూరి లక్ష్మయ్యతో పాటు కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో ఆయన మాట్లాడారు.

05/02/2019 - 23:05

బొమ్మలరామారం, మే 2: రాచకొండ పోలీస్‌కమీషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మెరకు హాజీపూర్ గ్రామానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గురువారం నుండి అదనంగా బస్సు సౌకర్యం కల్పించింది. లిప్ట్ ఇస్తానని విద్యార్థినులను నమ్మించి మార్గమద్యంలోని తన వ్యవసాయ బావివద్ద వారిపై అత్యాచారానికి ఓడిగట్టి ఆపై హత్యచేసి బావిలో పూడ్చిపెట్టిన దుశ్చర్యలు రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించాయి.

05/02/2019 - 22:59

వీణవంక/ మానకొండూరు/ కేసముద్రం/ సంగెం/ సూర్యాపేట, మే 2: ప్రచండ భానుడి ప్రతాపానికి జనం తల్లడిల్లిపోతున్నారు. ఉదయం పది గంటల నుంచే చాలా ప్రాంతాల్లో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో జనం బయటకు రావాలంటేనే హడలెత్తిపో తున్నారు. ఎండ తీవ్రతకు వృద్ధులు అల్లాడిపోతు న్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలను ఆశ్రయ స్తున్నారు.

05/02/2019 - 22:59

బోధన్, మే 2: మహారాష్టక్రు సరిహద్దులో గల నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరా వద్ద గల మంజీరా నది ఎడారిని తలపిస్తోంది. మండుటెండలకు నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో నదిలో చుక్క నీరు కూడా కనిపించడం లేదు. రెండు రాష్ట్రాల నడుమ ఉన్నటువంటి ఈ నదిలో పెద్ద మొత్తంలో ఇసుక నిలువలు పేరుకుపోయి ఉండటం వలన చూసేవారికి ఎడారిగా కనిపిస్తోంది.

05/02/2019 - 22:58

బొమ్మలరామారం, మే 2: నరహంతకుడు సైకొ మర్రి శ్రీనివాస్‌రెడ్డిని నడిరోడ్డుపై ఉరితీయాలని అతని పైశాచికత్వానికి బలైన ముగ్గురు విద్యార్థినుల కుటుంభసభ్యులు, అదేవిదంగా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్, పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

05/02/2019 - 22:58

హైదరాబాద్, మే 2: మూడో విడత పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. దాఖలైన నామినేషన్లను పరిశీలించి అభ్యర్థుల తుది జాబితాను శుక్రవారం ప్రకటించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మూడో విడతలో 161 మండలాలకు ఎన్నికలు జరుగునుండగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఎంపీటీసీలకు 3150 నామినేషన్లు, జడ్పీటీసీలకు 616 నామినేషన్లు దాఖలైనట్టు పేర్కొన్నారు.

Pages