S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/02/2019 - 02:46

హైదరాబాద్, మే 1: మూడో దశ మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడు గురువారంతో గడువు ముగియనుంది. అలాగే రెండో విడత దాఖలైన నామినేషన్ల ఉపసంహరణకు కూడా ఇదే రోజు తుది గడువు. కాగా మూడో దశ మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల ఎన్నికలకు తొలి రోజు దాఖలైన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

05/02/2019 - 02:45

నాగర్‌కర్నూల్, మే 1: మాగోడు పట్టించుకోవాలని, అకాల వానలతో బాగా నష్టపోయామని, మమ్ములను ప్రభుత్వమే ఆదుకోవాలని పలువురు రైతులు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముందు వాపోయారు.

05/02/2019 - 02:31

బొమ్మలరామారం: సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో అత్యాచారానికి గురై ఆపై హత్యచేయబడిన విద్యార్థినులు శ్రావణి, మనీషా, కల్పనల కుటుంబ సభ్యులను భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీతలు పరామర్శించారు. గురువారం బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో విద్యార్థినులు హత్యకు గురయిన సంఘటనా స్థలాన్ని ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత సందర్శించారు.

05/02/2019 - 02:24

నిజామాబాద్, మే 1: తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడడంతో జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ అడుగంటిన నీటి నిల్వలతో వెలవెలబోతున్నాయి. గతేడాదితో పోలిస్తే దాదాపుగా అన్ని ప్రాజెక్టుల్లోనూ గణనీయంగా నీటిమట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురియకపోతే, సాగునీటి మాటెలా ఉన్నా కనీసం తాగునీటిని సైతం సరఫరా చేసే పరిస్థితి కనిపించడం లేదు.

05/01/2019 - 22:38

నాగర్‌కర్నూల్, మే 1: అన్ లోడింగ్ తరువాత తరుగు పేరుతో కొంత తగ్గిస్తున్నారని, ఇదే జరిగితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.

05/01/2019 - 04:25

ఖైరతాబాద్, ఏప్రిల్ 30: ఇంటర్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల నివారణకు కృషి- విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై పోరాడుదాం అనే అంశంపై మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్‌లతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

05/01/2019 - 04:21

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు కొనసాగుతున్నాయి. మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో 45 డిగ్రీలు, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు, మెదక్‌లో 44 డిగ్రీలు, హన్మకొండ, హైదరాబాద్‌లో 41 డిగ్రీలు, హకీంపేట, దుండిగల్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే ఐదురోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

05/01/2019 - 04:20

హైదరాబాద్, ఏప్రిల్ 30: రైస్ మిల్లర్ల వద్ద ఉన్న కస్టమ్డ్ మిల్లింగ్ రైస్‌ను భారత ఆహార సంస్థ తీసుకుంటుంటుందని, దీనిపై మిల్లర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మిల్లర్ల వద్ద ఉన్న 3 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్డ్ మిల్లింగ్ ధాన్యాన్ని తీసుకోవడానికి ఎఫ్‌సీఐ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంగళవారం ఇక్కడ వెల్లడించారు.

05/01/2019 - 03:34

హైదరాబాద్, ఏప్రిల్ 30: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్‌గా ఇటీవల ఎన్నికైన గుండా ప్రకాశ్ మంగళవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కలిసారు. మేయర్‌గా ఎన్నికైన గుండా ప్రకాశ్‌ను ఆయన అభినందించారు. వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మేయర్ పోస్టు ఖాళీ కావడంతో తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసింది.

05/01/2019 - 03:31

హైదరాబాద్, ఏప్రిల్ 30: నాగర్‌కర్నూలు జిల్లా గగ్గలపల్లి ఎంపీటీసీగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకటనారాయణ రెడ్డిని బెదిరించి రూ.10 లక్షలు ఇచ్చారని, ఇది రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. ఈ విషయమై ఆయన మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకుగాను ఆ పార్టీ అక్రమాలకు పాల్పడిందన్నారు.

Pages