S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/01/2019 - 03:30

హైదరాబాద్, ఏప్రిల్ 30: మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల రెండో దశ ఎన్నికల్లో పోటీకి 32 జిల్లాల్లో దాఖలు చేసిన నామినేషన్ల స్కూృట్నీ మంగళవారం పూర్తి అయింది. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జడ్పీటీసీలుగా నామినేషన్ వేసిన 29 మంది అభ్యర్థులు, ఎంపీటీసీలుగా నామినేషన్ వేసిన 89 మంది అభ్యర్థుల పత్రాలు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించినట్టు పేర్కొన్నారు.

05/01/2019 - 02:54

చౌటుప్పల్, ఏప్రిల్ 30: కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌పై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో యూపీఏ, ఎన్డీయేకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మెజార్టీ వచ్చే పరిస్థితులు దరిదాపుల్లో లేవన్నారు.

05/01/2019 - 02:51

బోధన్ / దుబ్బాక / నాంపల్లి / చేగుంట, ఏప్రిల్ 30: ప్రచండ భానుడి ఉగ్రరూపానికి జనం తల్లడిల్లిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటితో జనం బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. వడదెబ్బ తగిలి నిజామాబాద్, సిద్దిపేట, మెదక్, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం ఇద్దరు మరణించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో అమ్దాపూర్ గ్రామంలో మంగలవారం పోతన్న ( 60) అనే కూలీ వడదెబ్బ తగిలి మృతి చెందాడు.

05/01/2019 - 02:51

సూర్యాపేట, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తూ సుపరిపాలనను కొనసాగిస్తుందని, నేటికీ ప్రజలు సమస్యలతో సతమతమయ్యేందుకు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలే కారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

05/01/2019 - 02:46

గనే్నరువరం, ఏప్రిల్ 30: ఏడడుగులు, మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఆ దంపతులు మరణంలో కూడా ఒకరి వెంట ఒకరు నడిచారు. మంగళవారం భర్త అనారోగ్యంతో మృతి చెందగా, భర్త మరణవార్త విని తట్టుకోలేక భార్య కూడా కుప్పకూలి చనిపోయింది. కరీంనగర్ జిల్లా గనే్నరువరం మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు బుర్ర రాజయ్య (80), మధురవ్వ (75) వీరిరువురు అనోన్యంగా జీవితాన్ని గడిపారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

04/30/2019 - 04:30

కామారెడ్డి, ఏప్రిల్ 29: హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన మహ్మద్ షబ్బీర్ అలీని సోమవారం హౌస్ అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించి, అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు తరిలించారు.

04/30/2019 - 04:28

కరీంనగర్, ఏప్రిల్ 29: ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడి, మహాధర్నాకు అఖిలపక్షాలు తరలివెళ్లకుండా ముందస్తుగా కట్ట‘్ఢ’చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి నుండే ఎక్కడికక్కడనే అఖిలపక్ష పార్టీలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

04/30/2019 - 04:14

నిర్మల్, ఏప్రిల్ 29: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతే వారికి పూర్తిస్థాయి పునరవాసం కల్పించి ఆదుకుంటామని పోలీసు ఐజీ ప్రమోద్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు సట్వాజీ అలియాస్ సుధాకర్, మాధవి దంపతులకు ఐజీ నగదు రివార్డును అందజేశారు. సట్వాజీకి రూ. 25 లక్షలు, మాధవికి రూ. 10 లక్షల చెక్కులను ఈ సందర్భంగా అందజేశారు.

04/30/2019 - 04:13

భువనగిరి, ఏప్రిల్ 28: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్యకేసులో 11మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రావణి హత్యకు ముందు అత్యాచారానికి గురైనట్లుగా అందిన సమాచారం దావానలంలా వ్యాపించి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది.

04/30/2019 - 02:55

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఇంటర్ మీడియట్ బోర్డును ముట్టడించడానకి బయలు దేరిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడానికి పోలీస్ బలగాలు ప్రయత్నించడంతో జంటనగనాల్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలతో పాటు జనసేన కార్యకర్తలు ప్రధాన రహదార్లపైకి గుంపులు గుంపులుగా కదలిరావడం జరిగింది.

Pages