S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/12/2020 - 05:35

హైదరాబాద్: పురపోరులో సత్తాచాటాలని భావించిన బీజేపీ అందుకు తగ్గట్టు అభ్యర్థులను సిద్ధం చేసుకోవడంలో విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. అనూహ్య ఫలితాలతో ఈసారి టీఆర్‌ఎస్‌కు షాక్ ఇద్దామని చూసిన బీజేపీకి అలాంటి అవకాశాలకు తగ్గట్టు సన్నద్ధత కన్పించడం లేదని పార్టీ నేతలో వాపోతున్నారు. గత నాలుగు నెలలుగా పార్టీ అనేక కార్యక్రమాలను చేపట్టింది.

01/12/2020 - 05:32

హైదరాబాద్, జనవరి 11: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం అధిక చార్జీలు వసూలుచేయాలనుకోవడం హిందూ భక్తులను ఇబ్బందులకు గురిచేయడమేనని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ దపేర్కొన్నారు. హాజ్ యాత్రకు వెళ్తామన్నవారికి అనేక రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వాలు హిందువులు తమ యాత్రలకు వెళ్తామనేసరికి చార్జీలను పెంచడమేమిటని ప్రశ్నించారు.

01/12/2020 - 01:36

హైదరాబాద్, జనవరి 11: ప్రపంచంలో భారత ఎన్నికల వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ వ్యవస్థ చాలా గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ఇక్కడ (తారామతి బారాదరి) ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య అవార్డు’ల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సవాళ్లతో కూడుకున్నదన్నారు.

01/12/2020 - 01:33

హైదరాబాద్, జనవరి 11: జనమంతా తమవైపే ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ దండును మట్టి కరిపిస్తామని, కాంగ్రెస్ శ్రేణులు ప్రజలందర్నీ కలుపుకుని వెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఇక్కడ గాంధీభవన్ నుంచి రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లోని పార్టీ నేతలతో ఫేస్‌బుక్ ద్వారా మాట్లాడారు.

01/12/2020 - 01:31

హైదరాబాద్, జనవరి 11: మున్సిపల్ ఎన్నికల సమరం వేడెక్కింది. మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని పెంచుతూ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

01/10/2020 - 17:21

హైదరాబాద్: సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్లన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయాన్ని సీఐడీ, ఈడీ కోర్టు ఈనెల 17కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న విజయ సాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ శ్రీలక్ష్మీ, శామ్యూల్ తదితరులు విచారణకు హాజరయ్యారు.

01/10/2020 - 17:09

హైదరాబాద్: డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్శిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. యూనివర్శిటీలో చిరుత సంచారం విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ పరీక్షలు ఈ నెల 22న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

01/10/2020 - 17:08

హైదరాబాద్: ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌర పట్టిక), సీఏఏ (పౌర సవరణ చట్టం)కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గాలో ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. దాదాపు 40 వేల మందితో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు అంచనా. ఇదిలా ఉండగా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ప్రసంగించనున్నారు.

01/10/2020 - 13:11

హైదరాబాద్: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి యువజన పోరాట సమితి నిరాహార దీక్ష చేపట్టింది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోని మహేశ్‌ బాబు ఇంటి ఎదుట విద్యార్థులు దీక్షకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఆందోళనాకారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.

01/10/2020 - 06:15

హైదరాబాద్, జనవరి 9: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా ఇది ఎంతో అవసరమని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది.

Pages