S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/10/2020 - 01:27

హైదరాబాద్: ఈనెలలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలాపడిన కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని తహతహలాడుతోంది.

01/10/2020 - 01:09

హైదరాబాద్, జనవరి 9: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పట్ల ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వారిని బుజ్జగించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించని వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని తన మాటగా హామీ ఇవ్వండని కూడా అధినేత కేసీఆర్ సూచించారు.

01/09/2020 - 13:37

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు రాష్టమ్రంతా అనుకూలంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమై మున్సిపల్‌ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్‌ పంపిణీ చేశారు.

01/09/2020 - 04:32

వరంగల్, జనవరి 8: సీఏఏను వ్యతిరేకించే వారిని బ్రేకులు లేని బస్సులో పాకిస్తాన్‌కు పంపిస్తామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం-2019కు మద్దతుగా బుధవారం వరంగల్ నగరంలో బీజేపి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. పచ్చ జెండాలతో ర్యాలీ తీసి ఓరుగల్లు గడ్డను అపవిత్రం చేసినందునే మళ్లీ ఈ గడ్డను పవిత్రం చేయడానికి ఈరోజు ఓరుగల్లులో కాషాయ ర్యాలీ నిర్వహించామన్నారు.

01/09/2020 - 05:03

మిర్యాలగూడ టౌన్, జనవరి 8: మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తూ దొడ్డిదారులు తొక్కుతోందని, అయనా కాంగ్రెస్ గెలవడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

01/09/2020 - 04:25

మునగాల, జనవరి 8: రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి చేయడమే తమ అధినేత, సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో జరుగుతున్న రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆయన బుధవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి పరిశీలించారు.

01/09/2020 - 05:15

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు తెలంగాణలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. సమ్మెకు ఇన్సూరెన్స్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ఆర్‌బీఐ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మద్దతు పలికారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు, కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

01/09/2020 - 03:34

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మేధో హక్కులపై పెసిలిటేషనద్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రకటించింది. మేధోహక్కులపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఇన్నోవేటర్లకు అవగాహన కల్పించేందుకు, సమాచారాన్ని అందించేందుకు ఈ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు సీఐఐ తెలంగాణ చైర్మన్ డీ రాజు చెప్పారు.

01/09/2020 - 01:06

హైదరాబాద్, జనవరి 8: న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. న్యూజిలాండ్ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధాకృష్ణన్ బుధవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

01/09/2020 - 01:03

హైదరాబాద్, జనవరి 8: రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోని 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో రిటర్నింగ్ అధికారులు బుధవారం ఎన్నికల ‘నోటీస్’ జారీ చేశారు. ఉదయం 10.30 గంటలకు నోటీస్ జారీ చేసిన వెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల

Pages