S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/08/2020 - 04:49

యాదగిరిగుట్ట, జనవరి 7: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు వేణుగోపాలస్వామిగా, గోవర్ధగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధ్యయనోత్సవాల రెండో రోజు దివ్యప్రబంధ పారాయణాల అనంతరం స్వామివారిని వేణుగోపాలస్వామి అలంకర సేవ నిర్వహించి బాల ఆలయంలో ఊరేగించారు. జీవులను ఉద్ధరించుటకు భగవానుడు దాల్చిన దశావతరాల్లో గొప్పదైన శ్రీ కృష్ణపరమాత్మ అవతారం.

01/08/2020 - 04:47

నారాయణపేట, జనవరి 7: అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతామని ముందుకు వచ్చే వారిని వద్దనే ప్రసక్తే లేదని, స్వచ్ఛందంగా వస్తున్న వారిని తామెందుకు కాదనాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్ర మున్సిపాలిటీకి చెందిన పలువురు బిజెపి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారి అనుచరులతో కలసి కాంగ్రెస్‌లో చేరారు.

01/08/2020 - 04:45

కొత్తకోట, జనవరి 7: సంకిరెడ్డిపల్లి గ్రామం అపరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ శే్వతామహంతి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని ఈదులబాయితాండాను పరిశీలించారు. అక్కడ మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరాపై సర్పంచును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు వెళ్లి ఆమె తనిఖీ చేశారు.

01/08/2020 - 02:29

హైదరాబాద్, జనవరి 7: ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు సంబంధించి అన్ని రకాల సమస్యల పరిష్కారానికి వీలుగా ఇంటర్మీడియట్ విద్యా మండలి ఒక ఆన్‌లైన్ వ్యవస్థను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఏర్పాటుచేసింది. ఈ వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ మంగళవారం ఉదయం ప్రారంభించారు.

01/08/2020 - 02:26

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ ప్రభుత్వం ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ‘లాభదాయకంగా వ్యవసాయం’ అంశంపై కేరళలోని త్రిసూర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో రైతులు ఆర్థికంగా లాభపడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

01/08/2020 - 02:24

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చైనీస్ మాంజాను వినియోగించినా, అమ్మినా, నిలువ చేసినా ఐదేళ్లపాటు జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుందని రాష్ట్ర హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, పీసీసీఎఫ్ ఆర్. శోభ తెలిపారు. చైనా మాంజా అంశంపై చర్చించేందుకు అరణ్య భవన్‌లో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

01/08/2020 - 02:22

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ రాష్ట్రంలో విశిష్ట సేవలు అందించిన 418 మంది పోలీసు అధికారులకు ప్రభుత్వం పోలీసు మేడల్స్‌ను అందజేయనున్నది.

01/08/2020 - 02:19

హైదరాబాద్, జనవరి 7: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8న దేశ వ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించే ఈ సమ్మెలో దేశంలో 25 కోట్ల మంది పాల్గొంటారని ఐఎన్‌టీయూసీ, ఎఐటీయూసీ, సీఐటీయూ, టీయుసీసీ తదితర సంఘాలు పేర్కొన్నాయి.

01/08/2020 - 02:18

హైదరాబాద్, జనవరి 7: ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం నాడు ఎండీ మహ్మద్ అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

01/08/2020 - 01:51

హైదరాబాద్, జనవరి 7: హైదరాబాద్ నగరంలో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించేందుకు ఉద్దేశించిన జీవో 20ను వెంటనే అమలు చేయాలని, కాలుష్య పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫోరం కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.

Pages