S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

06/29/2016 - 00:10

మామూలుగా గోళ్ళు మనతోబాటే పెరుగుతుంటాయి. కానీ కొన్నిసార్లు గోళ్ళకి దెబ్బ తగిలి, లోపలి రోగాల కారణాన అడ్డదిడ్డంగా పెరుగుతుంటాయి. పై పొర క్యుటికిల్‌కి క్రింద దెబ్బతగలడంవల్ల అడ్డంగా గీతలు వస్తుంటాయి. కొన్ని కీళ్ళ సమస్యలవల్ల చివరి వేలు కీలు, క్యుటికిల్ మధ్య పొడవాటి గీతలు వస్తుంటాయి. ఈ గీతలులోపలి రోగాలవల్ల వస్తే- ఆ అనారోగ్య సమస్యని కనుక్కుని చికిత్స చేయడంతో అవి పోతాయి.

06/29/2016 - 00:09

* నేను చాలా ఇ.సి.జిలు తీయించాను. కానీ ఆ రిపోర్ట్ గ్రాఫ్ మీదుండే పైకి, క్రిందకి వెళ్ళే గీతలు నాకెప్పుడూ అయోమయమే! వాటి అర్థం తెలుసుకోవడం ఎలా?

06/29/2016 - 00:07

కె.సుందర రామమూర్తి, ఖమ్మం
ప్ర: షుగరు రోగులు పంచదార లేకుండా పాలను, పాల పదార్థాలను తీసుకోవచ్చా?

06/29/2016 - 00:06

ఫ్రిక్షన్ తగ్గడానికి ఎముకల మధ్యగాని ఎముకలు - టెండానే్స మధ్యగాని తొలిగే టెండ్ ఫ్లూయిడ్‌తో వున్న సంచీలతో (బుర్సే) ఇన్‌ఫ్లమేషన్ రావడాన్ని ‘బుర్సిటిస్’ అంటారు. వీటికి దెబ్బలు తగిలినా విరిగినా ఇన్‌ఫ్లమేషన్‌లాంటివి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్‌మన్‌లో!

06/29/2016 - 00:05

యాస్ప్రిన్ తలనొప్పిని తగ్గిస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. పంటినొప్పిని తగ్గిస్తుంది. బహిష్టు సమయాల్లో వచ్చే క్రాంప్స్‌ని తగ్గిస్తుంది. ఆర్థ్రయిటిస్ నొప్పులను తగ్గిస్తుంది. యాస్ప్రిన్ మందులకు మూడు సంవత్సరాల కాలం వుంటుంది. ఘాటైన వాసనలు వాటినుంచి వస్తుంటే ఆ మందుల్ని మెడికల్ షాపుల్లో తిరిగి ఇచ్చేయాలి.

06/22/2016 - 00:17

ఈ రోజుల్లో ఊబకాయానికి ఎక్కువగా మహిళలు గురవుతున్నారు. దీనికి గల కారణం మారిన జీవన శైలి విధానమే. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చున్న చోటునుండే విధులు నిర్వర్తించటం, కదలికలు తగ్గిపోవటం, మానసిక స్థాయిలో పెరుగుతున్న ఒత్తిడి ఎక్కువై హార్మోనుల అసమతుల్యత ఏర్పడి ఊబకాయం వస్తుంది. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఇష్టపడి తినటం వలన సైతం లావెక్కుడం జరుగుతుంది.

06/21/2016 - 23:43

మన బరువే మనకు శత్రువుగా మారుతుందన్న విషయాన్ని చాలామంది గమనించలేకపోతున్నారు. బరువు పెరుగుతుంటే వ్యాధుల జాబితా కూడా పెరిగిపోతున్నది. అండాశయాల్లో నీటి తిత్తులు (పిసిఓడి), కీళ్లు అరిగిపోయి కీళ్ళనొప్పులు రావటం, నడుము నొప్పి, సంతానరాహిత్యం, మానసికంగా కుంగిపోవడం, మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ పెరుగుట, గుండెపోటు, పక్షవాతం, అజీర్ణ సమస్యలు, పిత్తాశయంలో రాళ్ళు వంటి సమస్యలు స్థూలకాయం వలన వస్తున్నవి.

06/21/2016 - 23:41

గర్భసంచి సర్జరీ ద్వారా తొలగించడం, మానసిక స్థితి ప్రభావము, హార్మోనుల అసమతుల్యత వలన స్థూలకాయం రావచ్చు. భోజనానికి భోజనానికి మధ్య విరామం లేకుండా ఏదో ఒకటి తినటం, పిజ్జాలు, కేకులు, శీతల పానీయాలు, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకొనడం, శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకోవడం, మానసికంగా ఒత్తిడికి గురి అయినపుడు తీసుకునే ఆహారం మోతాదు ఎక్కువ అవుతుంది.

06/21/2016 - 23:40

- నోటిలో పుళ్ళు రావడానికి స్ట్రెప్టోకాకల్ సూక్ష్మజీవులు కారణం. ఒక రకమైన వైరస్‌వల్ల హెర్పిస్ వైరస్ కాదు- వస్తోందన్నది అభిప్రాయం. అలర్జీలవల్ల నోటిలోపలి నున్నటి పొర దెబ్బతిని రావచ్చు. పోషకాహార లోపంవల్లా రావచ్చు. హార్మోన్ సమస్యలతో రావచ్చు. కొన్ని మందులవల్లా నోట్లో పుళ్ళు రావచ్చు. ఒత్తిళ్ళు కారణం కావచ్చు.

06/21/2016 - 23:38

కొన్ని సంవత్సరాలు ఇన్‌ఫెక్షన్స్‌తో ‘టాన్సిల్స్ అడినాయిడ్స్’లాంటివి ఏర్పడుతుంటాయి. అవి గొంతు, ఊపిరితిత్తులకు రక్షణనిస్తుంటాయి. రక్షణనివ్వవలసిన వాటికే క్రానిక్ ఇన్‌ఫెక్షన్స్ వుంటే వాటిని తొలగిస్తున్నారు.
పిల్లల్లో టాన్సిల్స్ పెరిగి మింగడం కష్టమవుతున్న సందర్భాలలో టాన్సిల్స్‌ని తొలగించక తప్పదు. టాన్సిల్స్ ఇన్‌ఫెక్షన్‌ని ‘టాన్సిలైటిస్’ అంటారు.

Pages