S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

02/16/2017 - 22:36

ఆపత్కాలంలో దుండగుల బారినుంచి ఆత్మరక్షణ చేసుకునేందుకు రకరకాల గాడ్జెట్లు అందుబాట్లోకి వచ్చాయి. పెప్పర్ స్ప్రే మొదలుకుని, కీచైన్‌లో అమర్చిన చిన్నపాటి కత్తులు, బటన్ ప్రెస్ చేయగానే మొన తేలిన కత్తి బయటకు వచ్చే గాడ్జెట్లు వంటివి వీటిలో కొన్ని. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ‘స్టింగర్ యుఎస్‌బి ఎమర్జెన్సీ ఎస్కేప్ టూల్’ కూడా అలాంటిదే. అయితే ఇది.. ప్రమాదవశాత్తూ కారులో ఎవరైనా ఇరుక్కుపోతే బయటపడేసే గాడ్జెట్.

02/16/2017 - 22:35

ఓ స్కేట్‌బోర్డ్
.. కులాల మధ్య పేరుకుపోయిన కుళ్లును కడిగేస్తోంది.
.. చిన్నారుల్లో ఐకమత్యం మొగ్గ తొడిగేందుకు దోహదపడుతోంది.
.. క్రమశిక్షణ నేర్పుతోంది. విద్యాబుద్ధులు గరుపుతోంది.
.. మనుషుల మధ్య అంతరాలను అంతం చేస్తోంది.
.. కలుషితమైన పెద్దల మనసుల్ని ప్రక్షాళన చేస్తోంది.

02/16/2017 - 22:31

కేవలం అంకెల ఆధారంగానే అభివృద్ధిని నిర్వచించలేం. సామాజిక, పరిసరాల ప్రభావం ఆధారంగానే అభివృద్ధికి నిర్వచనం చెప్పాలి.
-యురికే రీన్‌హార్డ్

02/16/2017 - 22:27

స్కేటిస్తాన్ అనేది ఓ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ. చిన్నారుల్లో చదువుల పట్ల జిజ్ఞాస రగిలించేందుకు, సాధికారత సాధించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమిది. ప్రస్తుతం మజరె షరీఫ్ (ఆఫ్ఘనిస్తాన్), నోమ్‌ఫెన్ (కంబోడియా), జోహానె్నస్‌బెర్గ్ (దక్షిణాఫ్రికా)లలో స్కేటిస్తాన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

02/16/2017 - 22:26

ఏం పని చేయాలో నిర్ణయించుకోండి...ఆ నిర్ణయం ప్రకారం పని చేయండి
- ఈతి అగర్వాల్
సిఎ ఆలిండియా టాపర్
**

02/16/2017 - 22:24

ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న తరుణంలోనే అంతర్జాతీయ వేదికపై ప్రతిభాపాటవాలు కనబరిచే అవకాశం రావడం అరుదైన విషయం. అలాంటి అరుదైన అవకాశాన్ని హైదరాబాద్‌కు చెందిన పంథొమ్మిదేళ్ల సలోనీ జైన్ చేజిక్కించుకుంది. హిమాయత్‌నగర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో రెండో ఏడాది చదువుతున్న సలోనీ, ఓవైపు చదువుకుంటూనే మరోవైపు తన ప్రతిభకు సానపెట్టుకుంటోంది.

02/16/2017 - 22:20

స్మార్ట్ఫోన్‌కు రకరకాల స్క్రీన్‌గార్డ్స్ అందుబాట్లో ఉన్నాయి. అయినా వాటి పని అంతంతమాత్రమే. కాస్త పైనుంచి పడితే స్క్రీన్ గ్లాస్ అంతే సంగతులు. అయితే ప్రొటెక్ట్‌పాక్స్ ఇన్విజబుల్ స్క్రీన్ ప్రొటెక్టర్‌ను ఉపయోగిస్తే స్మార్ట్ఫోన్ గ్లాస్‌ను సుత్తితో బాదినా పగలదట. ప్రొటెక్ట్‌పాక్స్ అనేది నానోటెక్నాలజీతో రూపొందించిన లిక్విడ్ గ్లాస్.

02/16/2017 - 22:18

చూడటానికి బ్రేస్‌లెట్‌లా కనిపిస్తున్న ఈ గాడ్జెట్ ఓ పవర్ బ్యాంక్ అంటే నమ్ముతారా? దీని పేరు నిఫ్టీ ఎక్స్ (నికూతి). యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ గాడ్జెట్ ఎంత స్టైలిష్‌గా ఉందో చూశారు కదా. దీనికి ఉండే కనెక్టర్ సాయంతో ఏ డివైస్‌కైనా నిఫ్టీఎక్స్‌ను సునాయాసంగా కనెక్ట్ చేయొచ్చు. దీని సాయంతో ఒకసారి స్మార్ట్ఫోన్‌ను చార్జ్ చేస్తే 50 నిమిషాలసేపు నిరాఘాటంగా మాట్లాడుకోవచ్చు.

02/10/2017 - 00:33

వేరెవర్ యు గో...అవర్ నెట్‌వర్క్ ఫాలోస్!- ఒకప్పటి హచ్ నెట్‌వర్క్ స్లోగన్ ఇది. ఓ కుర్రాడు ముందు వెడుతుంటే అతన్ని అనుసరించి పగ్ వెళ్లే ఈ అడ్వర్టయిజ్‌మెంట్ అప్పట్లో ఓ సంచలనం. పగ్‌లాగే మిమ్మల్ని అనుసరించి, మీ సూట్‌కేస్ వెనకాలే వస్తుంటే ఎలా ఉంటుంది? మజాగా ఉంటుంది కదూ. ఫొటోలో ఆ వ్యక్తి కూర్చున్నది అలాంటి సూట్‌కేస్‌పైనే. దీని పేరు ట్రావెల్‌మేట్ రోబో సూట్‌కేస్.

02/10/2017 - 00:31

పక్షి... తన పిల్లలకు రెక్కలొచ్చి, ఎగిరే శక్తి సమకూరేవరకూ ఆహారం ముక్కున కరచి తెచ్చి, నోటికి అందిస్తుంది.
కన్న బిడ్డ కాకపోయినా పాలకోసం ఏడ్చే పిల్లిపిల్లకు పాలిచ్చి ఆదరించే గ్రామసింహాలను చూసి ఉంటాం.
శత్రువైనా, తల్లి కనిపించక తల్లడిల్లిపోయే జింక కూనను పోనీలే పాపం అని వదిలిపెట్టే మృగరాజుల గురించీ విని ఉంటాం.

Pages