S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

04/20/2017 - 21:55

మ్యూజిక్ వింటూ స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొట్టడం సాధ్య కాదు. ఎందుకంటే చెవికి తగిలించుకున్న స్పీకర్లు నీటిలో తడిసిపోతాయి కాబట్టి. అయితే వండర్‌బూమ్ వాటర్‌ప్రూఫ్ స్పీకర్లతో అలాంటి ఇబ్బంది ఉండదు. ఇవి నూటికి నూరుపాళ్లూ వాటర్‌ప్రూఫ్ స్పీకర్లనీ, ఈత కొడుతూ వినాలనుకున్నా, ఎలాంటి అంతరాయమూ కలగదనీ వీటిని తయారు చేసిన అల్టిమేట్ ఇయర్స్ సంస్థ ఢంకా బజాయించి మరీ చెబుతోంది.

04/20/2017 - 21:54

టీనేజీ విద్యార్ధికి ఉండాల్సిన అన్ని లక్షణాలూ అతనికి ఉన్నాయి. అతను నవ్వితే ముత్యాలు రాలాల్సిందే. చురుకుతనంలోనూ ఎవరికీ తీసిపోడు. విషయ పరిజ్ఞానంలో అతనికి అతనే సాటి. అన్నింటికి మించి ఆ వయస్సులో ఉండే సిగ్గు, బిడియంతోపాటు తనపై తనకు సడలని ఆత్మవిశ్వాసం ఆ విద్యార్ధి ఆస్తిపాస్తులు. ఇన్ని గుణగణాలున్న ఆ కుర్రాడికి చూపు లేదన్న విషయం తెలిస్తే మాత్రం ఎవరికైనా కంట నీరు పెల్లుబుకమానదు.

04/20/2017 - 21:51

విద్య ప్రాథమిక హక్కు. కానీ, మన దేశంలో ఈ హక్కు చాలామందికి ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. చదువుకునే అవకాశం లేక ఎందరో మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతున్నారు. వారికే గనక ఓ అవకాశం ఇచ్చి చూస్తే అద్భుతాలు సృష్టిస్తారనడానికి సజీవ తార్కాణం ఆశా ఖేమ్కా. ఏడో తరగతి మధ్యలో ఆపేసిన ఆశా, ‘ఏషియన్ బిజినెస్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’గా ఎదగడానికి వెనుక స్ఫూర్తిదాయకమైన ఆమె ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం.

04/20/2017 - 21:48

నిండా పదమూడేళ్లు లేని ఈ కుర్రాడి పేరు అనీత్ కుమార. రెవారీ అతడి స్వస్థలం. యువమేధావుల ప్రపంచంలో అతడికీ చోటుంది. సోలార్ పవర్‌తో నడిచే బైక్‌ను కనిపెట్టడమే అతడి ఘనత. బైక్‌ను రూపురేఖలు, పనిచేసే విధానం అంతా అతడి సొంత ఆలోచనల ప్రతిరూపమే. పైగా దీని తయారీకి పెద్దగా ఖర్చుకాదు. దీనిని నడపడం వల్ల పర్యావరణానికి హాని కలిగించే వాయువులూ విడుదలకావు.

04/20/2017 - 21:45

నేలను శుభ్రం చేసే వాషింగ్ రోబోల గురించి విన్నాం. ఇప్పుడు విండో క్లీనింగ్ రోబోలు కూడా వచ్చేశాయి. ఎకోవాక్స్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన విన్‌బాట్ డబ్ల్యు 830 అనే రోబో గ్లాస్ విండోస్‌పైకి ఎగబాకుతూ చకచకా గ్లాస్ విండోస్‌ను శుభ్రం చేసేస్తుందట. ఇందులో ఉండే సెన్సర్ల సాయంతో ఇది తన దిశను కూడా మార్చుకునే వీలు ఉందట.

04/20/2017 - 21:39

తేనె చాలామందికి ఇష్టం..
కానీ ఓ పనె్నండేళ్ల అమ్మాయికి తేనెటీగలంటే ప్రాణం.

04/13/2017 - 21:59

ఇప్పుడు రోబోలదే హవా. ఆఫీసులోనే కాదు... ఇంట్లో ఏ పని చేయాలన్నా వాటికి చెబితే చాలు. దీనికి గార్డెనింగ్‌కూడా మినహాయింపు కాదు. కోబి రోబోటిక్ లాన్ మోవర్ అనే ఓ బుల్లి రోబో ఇప్పుడు మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. దీనిని మన స్మార్ట్ఫోన్‌లోని యాప్‌కు అనుసంధానిస్తే, ఎక్కడ కావాలంటే అక్కడకు వెడుతుంది...లాన్‌ను సరి చేస్తుంది. అదీ సంగతి.

04/13/2017 - 21:57

ఆకలితో అలమటించేవారికి అన్నంపెట్టే అన్నదాతల్ని చూశాం.
ఇల్లు లేకపోతే ఇళ్లు కట్టించే దానగుణశీలురినీ చూశాం.
అంతేగానీ...రోడ్డు లేకపోతే స్వయంగా రోడ్డు వేసేవారిని ఎక్కడైనా చూశామా?
చూడాలనుకుంటే మణిపూర్ వెళ్లొచ్చు. ఎవరా వ్యక్తి? ఏమా రోడ్డు కథ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం ఈ కథనం చదవాల్సిందే.

04/13/2017 - 22:05

అనగనగా ఓ తాత...ఓ మనవడు!
పదేళ్ల మనవణ్ని 76 ఏళ్ల తాత రోజూ పొలానికి తీసుకెళ్లేవాడు. పంటలు పండించడంలో ఉన్న తృప్తినీ, పదిమందికీ అన్నం పెట్టే రైతన్న గొప్పదనాన్ని విడమరచి చెప్పేవాడు.

04/13/2017 - 21:45

తీవ్రమైన పని ఒత్తిడినుంచి బయటపడాలంటే కాసేపు కునుకు తీస్తే బాగుంటుంది. కానీ అలా కునుకు తీసేందుకు కావలసిన సదుపాయాలు ఎక్కడబడితే అక్కడ ఉండవు. ఫోటోలో కనబడుతున్న అమ్మాయి తలకు తగిలించుకున్న గాడ్జెట్ పేరు కింగ్ ఐ మాస్క్ న్యాపింగ్ పిల్లో. తలకు, మెడకు కుషన్‌ను ఇచ్చే ఈ పిల్లోను తగిలించుకుని, ఫోటోలో ఆ చిన్నది కునుకు తీస్తున్నట్టుగా మనం కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చన్నమాట. ఈ పిల్లో ధర 45 డాలర్లు.

Pages