S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 03:17

హైదరాబాద్, నవంబర్ 18: ప్రత్యేక హోదా చెల్లని నోటు అంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడడం, ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవడం అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని కోర్టులో చంద్రబాబు న్యాయవాది వాదించడంపై వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

11/19/2016 - 03:16

మరకేశ్, నవంబర్ 18: వాతావరణ మార్పుపై పోరాడటానికి అత్యంత ఉన్నత స్థాయిలో రాజకీయ నిబద్ధతను ప్రదర్శించాలని భారత్ సహా సుమారు 200 దేశాలు పిలుపునిచ్చాయి.

11/19/2016 - 03:15

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెద్ద నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం తర్వాత సామాన్యులకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లిళ్ల సీజన్‌లో తమ పిల్లల పెళ్లిళ్లు పెట్టుకున్న కొన్ని కుటుంబాలు మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి.

11/19/2016 - 03:14

లండన్, నవంబర్ 18: బ్రిటన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువుకు చేరువైన ఓ టీనేజ్ బాలిక భవిష్యత్తులో తన వ్యాధికి వైద్యాన్ని కనుగొనే దాకా తన మృతదేహాన్ని కాపాడడం కోసం జరిపిన చారిత్రక న్యాయ పోరాటంలో చనిపోవడానికి కొద్ది రోజుల ముందు విజయం సాధించింది. శుక్రవారం ఈ కేసు వివరాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఆ బాలిక తన తల్లితో లండన్‌లో ఉంటోంది.

11/19/2016 - 03:14

హైదరాబాద్, నవంబర్ 18: విజయవాడ పోలీసుల తీరు పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో విజయవాడ పటమట డిప్యూటీ పోలీసు కమిషనర్ కె.ప్రవీణ్, కానిస్టేబుల్ విజయమాలిక్ ఈ నెల 22వ తేదీన హైకోర్టు ఎదుట హాజరు కావాలని జస్టిస్ సివి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె.జైస్వాల్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

11/19/2016 - 03:12

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లు, ప్రాధాన్యతా రోడ్ల నిర్మాణానికి 1,275 కోట్ల రూపాయలు కేటాయించాలని హడ్కో బోర్డు శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది. అమరావతిలో రానున్న మూడు సంవత్సరాల్లో చేపట్టే వివిధ ప్రాజెక్టులకోసం హడ్కో 7,500 కోట్ల రుణ సహాయం అందించేందుకు ఏపి రాజధాని అభివృద్ధి సంస్థతో ఒక ఒప్పందం చేసుకోవటం తెలిసిందే.

11/19/2016 - 03:12

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఏపీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిప్ట్) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విజయవాడ నుండి 30 కి.మీ దూరంలో ఉన్న కొండపవులూరు అమోదయోగ్యం కాదని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి టీడీపీ ఎంపీ టిజి వెంకటేశ్ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

11/19/2016 - 03:10

న్యూఢిల్లీ, నవంబర్ 18: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని చత్తీస్‌గడ్ మాజీ సిఎం అజిత్ జోగి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పిటిషన్‌ను అజిత్ జోగి ట్రిబ్యునల్ పిటిషన్ దాఖలు చేశారు.

11/19/2016 - 03:09

గుంటూరు, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆవరణలో మొబైల్ రైతుబజార్‌ను ఏర్పాటు చేయాలని మహిళా ఉద్యోగ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఎన్ సత్యసులోచన, అదనపు కార్యదర్శి కె జానకమ్మ తదితరులు కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.

11/19/2016 - 03:09

విశాఖపట్నం నవంబర్ 18: సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులను, అణు, అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర రాజ్యాల వైఖరిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ భద్రతకు ఐద్యరాజ్యసమితి అంతరిక్ష చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉందని బెంగుళూరు నేషనల్ లా యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఆర్.వెంకటరావు అన్నారు.

Pages