S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 03:32

హైదరాబాద్, నవంబర్ 18: నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితుల వల్ల ఆసరా పథకానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా 395 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నోట్ల రద్దు వంటి పరిణామాలతో ఉపాధి హామీ కూలీ చెల్లించేందుకు కొన్ని ఇబ్బందులు తలెత్తాయని మంత్రి తెలిపారు.

11/19/2016 - 03:32

హైదరాబాద్, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మనీకి కేరాఫ్ అడ్రస్ లాంటిదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

11/19/2016 - 03:31

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా లేదనే సందేహం ప్రజలకు కలుగుతోందని టిఆర్‌ఎస్ ఎంపి బి.వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చ జరగనీయకుండా కాంగ్రెస్ అడ్డుకోవడం సరికాదన్నారు. శనివారం నాడు ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ అవుతారని వెల్లడించారు.

11/19/2016 - 03:30

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణలోని 33 డిగ్రీ కాలేజీల్లో వౌలిక వసతుల కల్పనకు 150 కోట్ల రూపాయిలు వెచ్చించినట్టు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. శుక్రవారం నాడు ఆయన హయత్‌నగర్‌లో డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

11/19/2016 - 03:30

హైదరాబాద్, నవంబర్ 18: పెద్ద నోట్లను మార్చుకునేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి సెటిల్ చేసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళారని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద నోట్ల వంకతో ప్రజా సంక్షేమ కార్యకలాపాలను నిలిపి వేయాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు.

11/19/2016 - 03:29

హైదరాబాద్, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవడంతో నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద రూ.3 కోట్లను వాయిదాల రూపంలో చెల్లిస్తుంది. ఇప్పటికే మూడు విడతలలో రూ.కోటి 12 లక్షలు విడుదల చేసింది.

11/19/2016 - 03:28

హైదరాబాద్/ బేగంపేట, నవంబర్ 18: గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాలు, బాణామతి, చేతబడి వంటితో నలిగిపోతున్న గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యపరచడానికి తాము సైన్స్, మ్యాథమాటిక్ మెజీషియన్‌లతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ప్రముఖ ఇంద్రజాలకుడు, మ్యాజిక్ ఏసియా-2016 ఇంటర్నేషనల్ మెజీషియన్ కనె్వన్షన్ ఉత్సవాల చైర్మన్ సామల వేణు తెలిపారు.

11/19/2016 - 03:23

హైదరాబాద్, నవంబర్ 18: బాలలకు ఆలనా పాలనా లేకుండా వారి భవిష్యత్ అంధకారంలో ఉంటే సమాజం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం పాపమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సమాజాన్ని నేడు అనేక రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయని, వాటిని రూపుమాపేందుకు విద్యా సంస్థలు, పరిశోధక సంస్థలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

11/19/2016 - 03:20

హైదరాబాద్, నవంబర్ 18: విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పౌర సరఫరాల సంస్థ సంగారెడ్డి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. సంగారెడ్డితో పాటు మెదక్ జిల్లా ఇన్‌చార్జ్‌గా కూడా ఆయన ఉన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజర్ అయినందుకు చర్య తీసుకున్నారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న లక్ష్మీనారాయణను కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సంగారెడ్డికి బదిలీ చేశారు.

11/19/2016 - 03:20

హైదరాబాద్, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుంటే కెసిఆర్ నేతృత్వంలోని తెరాస సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజల తిరస్కారానికి గురవుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వేముల అశోక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Pages