S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 02:07

నరేంద్రమోదిగారి సలహాదారులలో ప్రచ్ఛన్న శత్రువులెవరో ఉన్నారు. ఆయన ప్రతిష్ఠను దిగజార్చటానికే వారు కంకణం కట్టుకున్నట్టున్నారు.

11/19/2016 - 02:02

హైదరాబాద్, నవంబర్ 18: నగదు మార్పిడి, ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం రోజుకో రీతిన మార్గదర్శకాలు జారీ చేస్తుండటంతో పనిలో పనిగా బ్యాంకులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఖాతాలో నగదు మార్పిడిని రోజుకు 2500 రూపాయలకు కుదించడంతో బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది అందుకు అడ్డదారులను కనిపెట్టేశారు.

11/19/2016 - 02:01

విశాఖపట్నం, నవంబర్ 18: నల్లధనం వెలికితీతలో రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం తొలి అడుగు మాత్రమేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లధనం వెలికితీసే క్రమంలో భవిష్యత్‌లో మోదీ తీసుకునే నిర్ణయాలు దేశ గతినే మార్చేస్తాయన్నారు.

11/19/2016 - 01:59

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఉన్నత న్యాయస్థానాల జడ్జిల పదవీవిరమణ వయస్సు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్‌మెంట్ వయసుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పిపి చౌదరి శుక్రవారం రాజ్యసభలో ఈ ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు, 24 హైకోర్టుల న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సు పెంపునకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

11/19/2016 - 01:59

న్యూఢిల్లీ, నవంబర్ 18: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఏర్పడిన నగదు కొరతను తగ్గించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డులను స్వైప్ చేసి 2 వేల రూపాయల నగదును తీసుకునే సదుపాయం శుక్రవారం దేశవ్యాప్తంగా దాదాపు 700 పెట్రోల్ బంకుల్లో ప్రారంభమైంది.

11/19/2016 - 01:57

హైదరాబాద్, నవంబర్ 18: చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు సరిపడా నగదు లభించక అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద పారిశ్రామికవాడలు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాయి. ఇక్కడ దాదాపు లక్షల సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌లతో పాటు నేపాల్‌కు చెందిన వారు అనేక మంది ఉన్నారు.

11/19/2016 - 01:56

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 18: చదువులో మరింత రాణించాలంటూ ఉపాధ్యాయులు చేసిన ఒత్తిడి భరించలేక ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మోతీనగర్‌లో నివాసం ఉండే ఎల్లయ్య బోరబండలోని ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని కుమార్తె శ్రీ వర్ష (17)ను గత సంవత్సరం ఎస్‌ఆర్ నగర్‌లోని నారాయణ కాలేజీలో చేర్పించారు.

11/19/2016 - 01:55

కడప, నవంబర్ 18: ర్యాగింగ్ భూతం మరో బిటెక్ విద్యార్థిని బలిగొంది. సీనియర్ విద్యార్థినులు, ఓ లెక్చరల్ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన కడప జిల్లా బద్వేలు మండలం బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బీరం జయరామిరెడ్డి కుమార్తె బీరం ఉషారాణి (19) వాస్మోల్ తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.

11/19/2016 - 01:25

క్రైస్ట్‌చర్చి, నవంబర్ 18: న్యూజిలాండ్ డెబ్యుడెంట్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ రికార్డు స్పెల్‌తో కొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో ఆడుతున్న తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి విలవిల్లాడిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

11/19/2016 - 01:23

ఇంగ్లాండ్‌పై రవిచంద్ర అశ్విన్ బ్యాటింగ్ సగటు అద్భుతంగా ఉంది.
అతను ఇంగ్లాండ్‌తో 13 ఇన్నింగ్స్ ఆడి,
50.90 సగటుతో మొత్తం 509 పరుగులు సాధించాడు.

Pages