S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజయవాడ పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్, నవంబర్ 18: విజయవాడ పోలీసుల తీరు పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో విజయవాడ పటమట డిప్యూటీ పోలీసు కమిషనర్ కె.ప్రవీణ్, కానిస్టేబుల్ విజయమాలిక్ ఈ నెల 22వ తేదీన హైకోర్టు ఎదుట హాజరు కావాలని జస్టిస్ సివి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె.జైస్వాల్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తన భర్త కె.రమేష్‌ను పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, ఆయనను హాజరుపరచాలని కోరుతూ గౌరీశ్వరి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి పోలీసులకు పై ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు పటమట పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.కెనడీ, సబ్ ఇన్‌స్పెక్టర్ బి.సంపత్ కుమార్ కూడా హాజరు కావాలని ఆదేశించింది. తన భర్తను డిసిపి దుర్భాషలాడాడని, ఆయనను నిర్బంధించిన తర్వాత పోలీసులు అతని వద్ద ఉన్న ఎటిఎం కార్డును ఉపయోగించి అక్టోబర్ 10 నుంచి 14వ తేదీ మధ్య 3.52 లక్షల రూపాయలను విత్‌డ్రా చేశారని పిటిషనర్ హైకోర్టుకు తెలిపింది. పిటిషనర్ పేర్కొన్న అంశాలు నిజమైతే, ఇటువంటి పోలీసు అధికారులు సమాజానికి హాని చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. ఈ కేసును పూర్తి స్ధాయిలో విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది.