S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 03:55

విజయవాడ, నవంబర్ 18: ఇంటింటికీ పైప్ లైన్‌తో గ్యాస్ సరఫరాకు సర్వం సిద్ధమవుతోంది. వచ్చే నెలలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా కొవ్వూరు, రాజమహేంద్రవరంలో ఇంటింటికీ పైప్ లైన్‌తో గ్యాస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. మలి విడతగా వచ్చే ఏడాది జూన్ నాటికి భీమవరం, ఏలూరులో సరఫరా చేయాలని భావిస్తోంది.

11/19/2016 - 03:54

రాజమహేంద్రవరం, నవంబర్ 18: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అచార్యుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ద్విసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక కాలగర్భంలో కలిసిపోతోంది. ఈ కమిటీ నివేదికను యూనివర్సిటీ అధికారులు బేఖాతరు చేశారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆచార్యుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని విచారించడానికి గవర్నర్ ఆదేశాల మేరకు ద్విసభ్య నిపుణుల కమిటీ విచారణ జరిపి అవకతవకలు జరిగాయని నివేదిక ఇచ్చింది.

11/19/2016 - 03:54

మదనపల్లె, నవంబర్ 18: జనచైతన్య యాత్రలకు వెళ్తున్న ఎమ్మెల్సీ కారు, మదనపల్లె నుంచి తిరుపతిరోడ్డులో ప్యాసింజర్‌లతో సిటిఎంకు వెళ్తున్న షేర్‌ఆటో ఢీకొంది. ఈఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఎమ్మెల్సీ ఎన్ నరేష్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది.

11/19/2016 - 03:53

భీమవరం, నవంబర్ 18: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న రైతు సభను వినూత్నంగా నిర్వహించడానికి పార్టీ నేతలు కృషిచేస్తున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే ఈ సభకు హాజరయ్యే వారంతా పంచెలు ధరించి హాజరయ్యేలా చూడాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సుమారు లక్షమందిని ఈ సభకు హాజరయ్యేలా చూడాలని పార్టీ నేతలు భావిస్తున్న సంగతి విదితమే.

11/19/2016 - 03:50

హైదరాబాద్, నవంబర్ 18: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించినవారి మృతదేహాలను తరలించేందుకు ప్రభుత్వం ఉచిత వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వాహనాలను నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావుజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

11/19/2016 - 03:44

వరంగల్, నవంబర్ 18: పెద్దనోట్ల రద్దు వ్యవహారం రైతులకు, వ్యాపారులకు పెద్ద సమస్యగా మారింది. సుమారు 10రోజులుగా రైతులు తీసుకువచ్చిన వివిధ ఉత్పత్తులకు డబ్బులు చెల్లించలేక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మార్కెట్ యార్డులలో లావాదేవీలు నిర్వహించే వ్యాపారుల చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో సకాలంలో డబ్బులు అందక రైతులు లబోదిబోమంటున్నారు.

11/19/2016 - 03:42

మహబూబ్‌నగర్, నవంబర్ 18: జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్రంలో నూతనంగా హైవే పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్, బిజాపూర్‌కు వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై కొడంగల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైవే పోలీస్‌స్టేషన్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డిలు ప్రారంబించారు.

11/19/2016 - 03:40

నాగర్‌కర్నూల్, నవంబర్ 18: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన 34మంది చెంచులను గుంపుమేస్ర్తి రెండేళ్ల క్రితం కర్నాటకకు తీసుకొనిపోయి వెట్టిచాకిరీ చేయిస్తుండగా, కాంట్రాక్టర్ కబంధహస్తాల నుంచి శుక్రవారం అక్కడి ప్రభుత్వం విముక్తి కలిగించింది.

11/19/2016 - 03:34

సంగారెడ్డి, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ చెరవుల మరమ్మతుల పుణ్యమాని ఊహించని స్థాయిలో భూగర్భంలో నీటి నిల్వలను పెంచుకోగలిగామని, ఇటీవల కురిసిన వర్షాలతో 450 టిఎంసిల నీటిని భూగర్భంలో నిల్వ చేసుకున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

11/19/2016 - 03:33

హైదరాబాద్, నవంబర్ 18: మిడ్ మానేరు ప్రాజెక్టులో రూ.347 వ్యయం చేసే కాంట్రాక్టును నీటిపారుదల శాఖ రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాల వల్ల మిడ్ మానేరు ప్రాజెక్టులో కట్ట కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

Pages