S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 02:11

భద్రాచలం, సెప్టెంబర్ 25: గోదావరికి వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు సైనికహెలీకాప్టర్లను రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినట్లుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఐటిడిఏ పిఓ చాంబర్‌లో ఆదివారం సాయంత్రం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

09/26/2016 - 02:11

భద్రాచలం, సెప్టెంబర్ 25: జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండుగా చీలనున్న ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటుగా, నూతన జిల్లా కొత్తగూడెం లెక్కలు ఒక కొలిక్కి వచ్చాయి. జనాభా మొదలు అక్షరాస్యత, పాడి పంటలు, భూములు, పరిశ్రమలు, గనులు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల లెక్కలు తేల్చేశారు.

09/26/2016 - 02:09

కర్నూలు, సెప్టెంబర్ 25:రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ చేపట్టామని ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని వ్యాస్ ఆడిటోరియంలో ‘రోడ్డు ప్రమాదాలపై దండయాత్ర’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకూ దాదాపు 5 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ చేపట్టారు.

09/26/2016 - 02:08

కర్నూలు, సెప్టెంబరు 25:జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. అందులో ప్రధానంగా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 879.7 అడుగలకు చేరింది. అలాగే వెలుగోడు రిజర్వాయర్‌లో రికార్డుస్థాయిలో నీరు చేరింది. కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

09/26/2016 - 02:06

నెల్లూరు, సెప్టెంబర్ 25: విజయా డెయిరీ పాలకవర్గంలో మూడు డైరెక్టర్ పదవులకు ఏర్పడిన ఖాళీకి సంబంధించి సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు అధికారిగా వరదారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది.

09/26/2016 - 02:06

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 25: ఒకే రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రెండు కక్ష్యలోకి ప్రవేశపెట్టనుండడంతో ప్రపంచ దేశాల చూపంతా షార్ వైపే ఉంది. ఇస్రో శాస్తవ్రేత్తలు షార్ కేంద్రం నుండి ప్రతి ప్రయోగంలో ఏదోఒక కొత్తదనంతో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు.

09/26/2016 - 02:04

కందుకూరు రూరల్, సెప్టెంబర్ 25: స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌లో వాషర్‌మెన్‌గా పనిచేస్తున్న ఎం శ్రీరామమూర్తి విధి నిర్వహణలో ఉండగా బస్సు డీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందడంతో అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు.

09/26/2016 - 02:04

మార్కాపురం, సెప్టెంబర్ 25: వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్రప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాష్ట్ర టిడిపి కార్యదర్శి, రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ వినుకొండ సుబ్రహ్మణ్యం అన్నారు.

09/26/2016 - 02:03

ఒంగోలు అర్బన్,సెప్టెంబర్ 25:రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎపి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి చైతన్య హరిబాబు అన్నారు. ఆదివారం అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంసిఎ భవన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/26/2016 - 02:03

సంతనూతలపాడు, సెప్టెంబర్ 25 : సంతనూతలపాడులోని మైనంపాడు డొంక సమీపంలోని అనంతపురం నుండి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ బస్సు ఆదివారం ఉదయం బోల్తాపడిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అనంతపురం నుండి విజయవాడ వైపు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నూతలపాడు చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో మార్జిన్‌లోకి రావడంతో బస్సు పక్కకు ఒరిగి బోల్తా పడింది.

Pages