S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 01:23

వేలేరుపాడు, సెప్టెంబర్ 25: వేలేరుపాడు మండలంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం చేపట్టనున్న ఆర్‌అండ్‌ఆర్ సర్వేను ప్యాకేజీ స్పష్టం చేస్తేనే జరగనిస్తామని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

09/26/2016 - 01:22

భీమవరం, సెప్టెంబర్ 25: ఇంజనీరింగ్ విద్యార్థులు సృజనాత్మకతను మరింత మెరుగుపెట్టి వ్యాపార రంగంలో నూతన ఒరవడులు సృష్టించాలని దక్షిణ భారతదేశ థర్మాక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ సామిల్ షా పిలుపునిచ్చారు.

09/26/2016 - 01:22

ఏలూరు, సెప్టెంబర్ 25 : చిన్నప్పుడు చదువుకున్న బేతాళ కధలా ఈ వ్యవహారం కూడా మారిపోయింది. ఎప్పటికప్పుడు జరుగుతున్న తంతు అంతా తప్పుదోవ పడుతూనే వున్నా దానిపై విమర్శలు చెలరేగుతూనే వున్నా ఉన్నతాధికారుల దృష్టి మాత్రం ఈ వ్యవహారంపై లేకుండా పోతుంది. చివరకు ఇది ఒక బహిరంగ రహస్యంలా, ఓపెన్ దందాగా మారిపోయిందనే చెప్పవచ్చు. ఈ ఉపోద్ఘాతమంతా ఓపెన్ స్కూల్స్ పరీక్షల గురించే.

09/26/2016 - 01:18

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 25: గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అంతర్గత రహదారులు నిర్మించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తాళ్ళపాలెం పంచాయతీ పరిధిలోని సత్తెనపాలెం దళితవాడకు ఎన్‌పిఆర్‌ఎంపి పథకం కింద రూ.56 లక్షల వ్యయంతో చేపట్టిన తారురోడ్డు నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.

09/26/2016 - 01:17

చందర్లపాడు, సెప్టెంబర్ 25: వారం నుండి కురుస్తున్న వర్షాలకు తోడు ఆదివారం చందర్లపాడు మండలంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. జూన్‌లోనే పత్తి వేయటంతో పంట చేతికొచ్చే సమయానికి కురుస్తున్న వర్షాలకు పత్తికాయలు నల్లబడి దిగుబడి పూర్తిగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

09/26/2016 - 01:17

అవనిగడ్డ, సెప్టెంబర్ 25: తెలుగు జాతిరత్నం దివంగత మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం 10గంటలకు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ముగ్గురు ప్రముఖులకు మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆయన తనయుడు, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వర్ధంతి కార్యక్రమాలను వివరించారు. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు పద్మశ్రీ డా.

09/26/2016 - 01:16

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 25: స్థానిక బిజెపి కార్యాలయంలో ఆదివారం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతిని ఘనంగా నిర్వహించారు. దీన్‌దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసంఘ్ బలోపేతానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం చిలకలపూడిలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

09/26/2016 - 01:16

పెడన, సెప్టెంబర్ 25: పెడన మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఈ నెల 29న జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో రాజకీయాన్ని కాక పుట్టిస్తున్నాయి. ఎంపిపి పదవిని దక్కించుకునేందుకు గతంలోనే ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ నాడు టిడిపి వ్యూహానికి ఆ పదవిని కాస్తా చేజార్చుకుంది.

09/26/2016 - 01:15

నాగాయలంక, సెప్టెంబర్ 25: స్థానిక శ్మశానవాటిక స్థలం విషయంలో నాగాయలంక, రేమాలవారిపాలెం గ్రామాల మధ్య తిరిగి వివాదం రాజుకుంది. ఈ నెల 24న రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన రేమాల వెంకటరత్నం అనే మహిళ మృతదేహాన్ని నాగాయలంక పంచాయతీ పరిధిలోని తాగునీటి చెరువు దక్షిణం వైపున ఖననం చేసేందుకు ప్రయత్నించిన సంఘటన వెలుగు చూడటంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.

09/26/2016 - 01:15

జి కొండూరు, సెప్టెంబర్ 25: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతలతో ఈ నెల 27న విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ సుధారాణి ఆదివారం తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు సమంజసమైన ధర ఇవ్వనందుకు రైతులు రహదారి విస్తరణ పనులను అడ్డుకున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

Pages