S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 01:15

గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 25: మండల పరిధిలోని వేమవరం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో అక్టోబరు 1 నుండి 11వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జివిడిఎన్ లీలాకుమార్ ఆదివారం తెలిపారు. ఈసందర్భంగా పదకొండు రోజులూ అమ్మవారికి విశేష అలంకారాలు చేస్తున్నట్లు తెలిపారు.

09/26/2016 - 01:14

ఇంద్రకీలాద్రి. సెప్టెంబర్ 25: పసిడికాంతులతోధగ ధగ మెరిస్తున్న శ్రీకనకదుర్గమ్మను బంగారు తలుపుల గుండాలోనికి వెళ్లి దర్శనం చేసుకునే భాగ్యం ఆదివారం నుండి భక్తులకు లభించింది. గతంలో కేవలం అమ్మవారి గోపురం మొత్తం స్వర్ణమయంగా ఉండేది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు గోపురాన్ని వీక్షించేవారు.

09/26/2016 - 01:13

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 25: విజయవాడ నగర పాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిందన్న సంతోషం కన్నా విచారమే ఎక్కువగా కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

09/26/2016 - 01:13

విజయవాడ, సెప్టెంబర్ 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దారుణంగా మోసం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి డా కె నారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కావాలా? ప్యాకేజీలు కావాలా? అనే అంశంపై ప్రజాభిప్రాయం కోరేందుకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం 7 డివిజన్ నిమ్మతోట సెంటర్‌లో ప్రజాబ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు.

09/26/2016 - 01:12

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తన వంతు కృషి చేస్తానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు.

09/26/2016 - 01:12

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: నగరంలో ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన తీసుకురావడానికి ఆదివారం యువతీ యువకులు కదం తొక్కారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆదేశాలతో ట్రాఫిక్ డెప్యూటీ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పర్యవేక్షణలో నగరంలోని పలు కళాశాలల విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాలను చేపట్టారు.

09/26/2016 - 00:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే ప్రధాన అంశాలేవీ లేని నేపథ్యంలో సెప్టెంబర్ నెల డెరివేటివ్‌ల గడువు ముగుస్తూ ఉండడం వచ్చేవారం దేశీ మార్కెట్లను ఆటుపోట్లకు గురి చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే విదేశీ పెట్టుబడుల రాకడ కొనసాగడంలాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా వారంటున్నారు.

09/26/2016 - 00:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తదుపరి రెండు త్రైమాసికాల్లో దేశ వృద్ధి రేటు 8 శాతంకంటే ఎక్కుగా నమోదవడం ఖాయమని, రుతుపవనాలు ఎంతో మెరుగ్గా ఉండటం, కేంద్ర ప్రభుత్వం సకాలంలో విధాన నిర్ణయాలను తీసుకోగలుగుతుండటంతో పాటు ఆర్థిక సంస్కరణల వేగం పెరగడం వృద్ధి రేటు పెరిగేందుకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా స్పష్టం చేశారు.

,
09/26/2016 - 00:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: అంబానీలు మొదలుకొని అదానీల దాకా.. ప్రేమ్‌జీలు మొదలుకొని ఖోరకివాలాల దాకా కుటుంబ వ్యాపారాలను నిర్వహిస్తున్న కుటుంబాలుతమ పిల్లల్ని సైతం తమ వ్యాపారాల్లో వారసులుగా ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాపారాభివృద్ధికి తమ వంతు సేవలందిస్తున్న పుత్ర రత్నాలకు ఆయా కంపెనీలు వేతనాలు, లేదా ఇతర సదుపాయాల రూపంలోఏటా కోట్ల మొత్తం చెల్లిస్తున్నాయి.

09/26/2016 - 00:43

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: మెరైన్ ప్రోడక్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంపెడా), సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ నెల 23 నుంచి విశాఖలో నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ఆదివారంతో ముగిసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించగా, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Pages