S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 04:50

హైదరాబాద్, సెప్టెంబర్ 24: మహానగరంలో తరుచూ కురుస్తోన్న భారీ వర్షాలతో నీటి మునిగిన ప్రాంతాల్లోని ప్రజలకు సహాయక చర్యలను అందించేందుకు సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నిన్నమొన్నటి వరకు జిహెచ్‌ఎంసి, ఫైర్, పోలీసు, రెవెన్యూ విభాగాలు చేపట్టిన సహాయక చర్యలు ఆశించిన స్థాయిలో ఫలించకపోవటంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.

09/25/2016 - 04:49

హైదరాబాద్, సెప్టెంబర్ 24: వరదల నివారణతో పాటు సహాయక చర్యలు చేపట్టడంలోనూ సర్కారు విఫలమైందని గ్రేటర్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 26న గ్రేటర్‌లోని అన్ని సర్కిల్ ఆఫీసుల ముందు బిజెపి కార్యకర్తలు ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

09/25/2016 - 04:48

హైదరాబాద్, సెప్టెంబర్ 24: కొంతకాలం క్రితం వర్షాకాలంలోనూ వానలు పడక కరుణించాలంటూ నగరవాసులు వరుణుడిని వేడుకునే వారు..అంతేగాక, మతాలకతీతంగా ఉస్మాన్‌సాగర్‌లో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తరుచూ కురుస్తుండటంతో వరుణుడు శాంతించి వర్షాలు ఆగాలని ప్రార్థిస్తున్నారు.

09/25/2016 - 04:48

హైదరాబాద్, సెప్టెంబర్ 24: నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యల పర్యవేక్షణ నిమిత్తం జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు జిహెచ్‌ఎంసికి సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు 21111111 నెంబర్ మాత్రమే ఉండేది.

09/25/2016 - 04:47

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి సూచించారు. శనివారం జిల్లా అధికారులతో మంత్రి సమావేశమై వర్షాలపై ఆరా తీశారు. మరో రెండు, మూడు రోజులు వర్షాలు ఉన్నందున హైదరాబాద్ పరిసర రంగారెడ్డి జిల్లా మూసీ, ఈసీ కాగ్నా నదీ పరివాహక ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

09/25/2016 - 04:47

అల్వాల్, సెప్టెంబర్ 24: అల్వాల్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉన్న చెరువులు అన్ని నిండుకుండలా మారి మిగిలిన నీరు మత్తడి ద్వారా పొంగిపొర్లడంతో ఏకధాటిగా వరద నీరు ప్రవహించి కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. వరద బాధితులకు పరామర్శల పర్వం కొనసాగుతోంది. బాధితులకు దాతలు ఎవరికి తోచిన విదంగా వారు సహకారం అందిస్తున్నారు.

09/25/2016 - 04:46

జీడిమెట్ల, సెప్టెంబర్ 24: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీలోని తుర్కచెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు గండి కొట్టారు. అయితే చెరువులో నుండి వరద నీరు ఉద్ధృతంగా కాలనీ అపార్ట్‌మెంట్‌లలో చేరింది. దీంతో అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో వరద నీరు నిండింది. నాలుగురోజులుగా వరద నీరు అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో నిలిచిపోయింది.

09/25/2016 - 04:45

ఉప్పల్, సెప్టెంబర్ 24: కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం జలదిగ్భందంలో చిక్కుకుని అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షం నీరు ఇళ్లలోకి చేరి జనజీవనం స్తంభించింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు.

09/25/2016 - 04:44

ఉప్పల్, సెప్టెంబర్ 24: ఎడతెరిపి లేకుండా కుండపోతలా కురుస్తున్న భారీ వర్షాలతో జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్, శివారు జంట పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలో చెరువులు నిండుకుండలా తయారయ్యాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో నిండి కిందికి అలుగులు పోస్తున్నప్పటికీ పరిసర ప్రాంతాలలోని కాలనీలు వరద నీటితో ముంపుకు గురయ్యాయి.

09/25/2016 - 04:44

మేడ్చల్, సెప్టెంబర్ 24: ఎన్నాళ్లకెన్నాళ్లకో మేడ్చల్ చెరువులు జలకళను సంతరించుకుని నిండుకుండలా దర్శనమిస్తుండటంతో ప్రజలు, అన్నదాతలు ఆనందంతో ఉబ్బితబ్బివుతున్నారు. గడచిన 10 సంవత్సరాలలో మేడ్చల్ మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు నిండిన దాఖలాలు లేవు. రెండుమూడు రోజులుగా కురిసిన కుండపోత వర్షానికి చెరువులు పూర్తిగా నిండటంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది.

Pages