S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిండు కుండల్లా చెరువులు..్భయం నీడలో కాలనీలు

ఉప్పల్, సెప్టెంబర్ 24: ఎడతెరిపి లేకుండా కుండపోతలా కురుస్తున్న భారీ వర్షాలతో జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్, శివారు జంట పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలో చెరువులు నిండుకుండలా తయారయ్యాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో నిండి కిందికి అలుగులు పోస్తున్నప్పటికీ పరిసర ప్రాంతాలలోని కాలనీలు వరద నీటితో ముంపుకు గురయ్యాయి. కెపాసిటీకి మించి వరద నీరు చేరుకుంటుండటంతో చెరువుల కింద ఉన్న కాలనీల ప్రజలు భయాందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. నగర శివారు ఇతర ప్రాంతాలలోని చెరువులకు గండి పడి వరద నీరంతా కాలనీలు జలదిగ్ధందం అయిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నల్లచెరువు తెగిపోగా రామంతాపూర్ చెరువుకు ఏకంగా గండి కొట్టిన విషయం తెలిసిందే. భారీ వర్షాలున్నాయని హెచ్చరికల నేపధ్యంలో ప్రస్తుతం రామంతాపూర్ పెద్ద, చిన్న చెరువులు, ఉప్పల్ పెద్ద, నల్ల చెరువులు నిండాయి. బోడుప్పల్‌లోని రాచెరువు, సుద్దకుంట, పీర్జాదిగూడలోని గూడెం చెరువు, పోచమ్మ కుంటలు నిండిపోయి అలుగుల వద్ద నీటి ఉధృతి పెరిగింది.
ఇప్పటికే కింది ప్రాంతాలలోని కాలనీలలోకి వరద నీరు చేరుకుని జనజీవనం స్తంభించిపోగా మున్ముందు ఏం ముప్పు వాటిల్లుతోందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులైతే ఎలాంటి భయం వద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని భరోసా ఇస్తున్నారు.