S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 05:02

విజయవాడ, సెప్టెంబర్ 24: నిరుపేదలకు ఇ-కామర్స్ విధానం అలవర్చాలని ఉద్దేశంతో నగదు రహిత నిత్యావసర సరుకుల పంపిణీ విధానానికి జిల్లాలో శ్రీకారం చుట్టినట్లు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు ప్రపంచ బ్యాంక్ డాక్యుమెంటేషన్ బృందానికి వివరించారు.

09/25/2016 - 05:01

విజయవాడ, సెప్టెంబర్ 24: పరిసరాల్లోను, ఇళ్లలోను పరిశుభ్రత పాటించడం ద్వారా రాష్ట్రాన్ని దోమలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక 45వ డివిజన్, మధురానగర్‌లో శనివారం నిర్వహించిన ‘దోమలపై దండయాత్ర - పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

09/25/2016 - 05:01

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 24: పోలీసు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పని చేస్తూ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేయాలని జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్ పేర్కొన్నారు. ఇదే సమయంలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. హనుమాన్‌పేటలో కృష్ణాజిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నెలవారీ సమీక్ష సమావేశం శనివారం జరిగింది.

09/25/2016 - 05:00

విజయవాడ, సెప్టెంబర్ 24: జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకం, ఈ దశలో తీసుకునే నిర్ణయాలు చేసే పనుల వల్లనే జీవితంలో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ యువజనోత్సవాల్లో భాగంగా యంగ్ వింగ్స్ పేరుతో నగరంలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో రెండురోజులపాటు జరిగే వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి.

09/25/2016 - 05:00

పాతబస్తీ, సెప్టెంబర్ 24: దోమలపై యుద్ధం - పరిసరాల పరిశుభ్రత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు 28వ డివిజన్ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం మోడల్ రైతుబజార్‌లో శానిటేషన్ సిబ్బందితో కలిసి అక్కడ నిలిచిన వర్షపు నీరు, చెత్త చెదారం శనివారం తొలగించారు. వనం - మనం కార్యక్రమంలో భాగంగా రైతుబజార్ రహదారి వెంట మొక్కలు నాటటం జరిగింది.

09/25/2016 - 05:00

విజయవాడ, సెప్టెంబర్ 24: సాయిపథం (షిరిడి) నిర్వహణలో సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్, సద్గురు సాయినాథుని శరత్‌బాబుజీ ఆశీస్సులతో గవర్నర్‌పేట, ఐవి ప్యాలెస్‌లో జరుగుతున్న సాయిబాబా ద్వితీయ నామ సప్తాహ మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. శనివారం సాయంత్రం సాయిబాబా భక్తులు రంగవల్లుతో సాయినాథునికి దీపాలంకరణ చేశారు.

09/25/2016 - 04:59

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 24: రోడ్డు ప్రమాదంలో యాష్ లారీ ఢీకొని ఎంబిఎ విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం నిమ్రా కాలేజీ ఎదురుగా జరిగింది.

09/25/2016 - 04:58

పటమట, సెప్టెంబర్ 24: పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఎమ్మెల్యే గద్దె అన్నారు. 12వ డివిజన్‌లో దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతపై శనివారం జరిగిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుదల, ఔట్ ఫాల్ డ్రైయిన్లు, సైడ్ డ్రైయిన్లలో పూడికలను తొలిగించి, మురుగునీరు సక్రమంగా పారేందుకు కృషి చేయాలని అన్నారు.

09/25/2016 - 04:58

గుడివాడ, సెప్టెంబర్ 24: ప్రమాదవశాత్తూ చంద్రయ్య కాల్వలో పడి యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెదఎరుకపాడు వార్పు రోడ్డులో ఉంటున్న పఠాన్ బిస్మిలా ల(23) తాపీ కార్మికుడిగా పనిచేస్తున్నా డు. శుక్రవారం రాత్రి కార్మికనగర్లోని తల్లిదండ్రులు పఠాన్ మరదసా, నజీమాల ఇంటికి వచ్చి వెళ్తూ స్నేహితుడితో కలిసి చంద్రయ్య కాల్వ వద్ద మాట్లాడుతున్నాడు.

09/25/2016 - 04:58

మచిలీపట్నం, సెప్టెంబర్ 24: బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌పై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. భూములిచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మెరుగ్గా ఉన్నప్పటికీ అది అసలైన రైతులకు అందుతుందా? లేదా? అనేది సందేహాస్పదంగా మారింది.

Pages