S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 05:24

తడ, సెప్టెంబర్ 24: ఆధార్ వ్యవస్థ పర్యవేక్షణ సాధికార సంస్థ యూనిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎ సత్యనారాయణ శనివారం శ్రీసిటీని సందర్శించారు. ఈయనకు శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికి శ్రీసిటి వద్ద వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. అనంతరం చైర్మన్ సత్యనారాయణ శ్రీసిటీలోని పరిసరాలను పరిశీలించారు.

09/25/2016 - 05:22

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 24:ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ప్రతిఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు దోమల నిర్మూలనలో భాగస్వాములు కావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

09/25/2016 - 05:20

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 24: ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక టిటిడిసిలో జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల ఏర్పడిన నష్టంపై కలెక్టర్ లోకేష్‌కుమార్‌తోపాటు అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు.

09/25/2016 - 05:18

అమరావతి, సెప్టెంబర్ 24: అల్పపీడన ప్రభావంతో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సాయంత్రం పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని క్రోసూరు, అమరావతి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. క్రోసూరు మండలంలోని పీసపాడు వద్ద పొలాలను ముంచెత్తిన వాగును, అందుకూరు వాగులను పరిశీలించారు.

09/25/2016 - 05:16

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: ప్రకృతి అందాలతో అలరారే తూర్పు గోదావరి జిల్లాలను టూరిజం హబ్‌గా మార్చుతామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోదావరి నది మహా పుష్కరాల సమయంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టును రూ.100 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

09/25/2016 - 05:13

తిరుపతి, సెప్టెంబర్ 24: ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో శనివారం చిత్తూరు జిల్లాలో ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా దోమలపై యుద్ధం ప్రకటించి ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించింది.

09/25/2016 - 05:10

కడప,సెప్టెంబర్ 24: ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ ధ్యేయమని, వ్యక్తిగత శ్రద్ధతో రోగాలు వ్యాపించకుండా చూసుకోవాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక స్టేట్ గేస్టు హౌస్ నుంచి పాత కలెక్టర్ కార్యాలయం వరకు దోమలపై దండయాత్ర- పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు.

09/25/2016 - 05:05

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 24: దోమ రహిత జిల్లాగా అనంతను మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈమేరకు నగరంలో శనివారం నిర్వహించిన దోమలపై దండయాత్ర అవగాహన ర్యాలీని మంత్రి కామినేని ప్రారంభించారు.

09/25/2016 - 05:04

ఆత్మకూరు, సెప్టెంబర్ 24: ఆత్మకూరు-కూడేరు మండల సరిహద్దులోని తిమ్మాపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ నుంచి మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాసులు, మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు శనివారం రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల పరిధిలోకి నీటిని విడుదల చేశారు.

09/25/2016 - 05:02

విజయవాడ, సెప్టెంబర్ 24: ఏపిసిఆర్‌డిఎ పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధన నిమిత్తం తగు సహకారం అందించే దిశగా ఏపిసిఆర్‌డిఏ డెవలప్‌మెంట్ సెంటర్‌ను శనివారం సంస్థ విజయవాడ కార్యాలయంలో ప్రారంభించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలు రాజధాని ప్రాంతంలో ఉన్నందున ఈ ప్రాంతం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.

Pages