S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 05:34

విజయనగరం(టౌన్),సెప్టెంబర్ 24: దోమల నియంత్రణను ప్రజలు సామాజిక బాధ్యతగా గుర్తించి భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రిమృణాళిని చెప్పారు. శనివారం ఆనందగజపతి ఆడిటోరియంలో విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత అధ్యక్షతన జరిగిన దోమలపై దండయాత్ర- పరిసరాల పరిశుభ్రత పై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచినపుడే ఆరోగ్య సమాజాన్ని నిర్మించగల మని చెప్పారు.

09/25/2016 - 05:32

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)కు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమేనని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశమైన సమన్వయ కమిటీ ఎమ్మెల్యేలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా నగర అభివృద్ధికి పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిపారు.

09/25/2016 - 05:32

అనకాపల్లి, సెప్టెంబర్ 24: ప్రత్యేక హోదాకు మించి ఆంధ్రప్రదేశ్‌కు పెద్దమొత్తంలో ప్యాకేజీ పేరిట కేంద్రం నుండి నిధులు సేకరించిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కుతుందని జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశం కితాబునిచ్చింది. స్థానిక వివేకానంద చారిటబుల్ ట్రస్టు హాలులో శనివారం జరిగిన జిల్లా దేశం సమన్వయ కమిటీ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పప్పల చలపతిరావు అధ్యక్షత వహించారు.

09/25/2016 - 05:31

మునగపాక, సెప్టెంబర్ 24: ప్రాణాంతక వ్యాధులకు కారణమైన దోమల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని యలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు పిలుపునిచ్చారు. మండలంలో గల నాగులాపల్లి పంచాయితీ దోమలపై దండోరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంచకర్ల శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగులాపల్లి వీధుల్లో దోమలవల్ల కలిగే అనర్ధాలను అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.

09/25/2016 - 05:31

చోడవరం, సెప్టెంబర్ 24: జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం మండలంలో సుడిగాలి పర్యటన జరిపి వరద ధాటికి కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు, కల్వర్టులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలను పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు. ఉపాధ్యాయులు, గ్రామరెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

09/25/2016 - 05:30

విశాఖపట్నం, సెప్టెంబరు 24: జివిఎంసి ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలోగా ఎన్నికల తంతు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు జివిఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అంతర్గత కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని వైకాపా అధినేత జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

09/25/2016 - 05:29

చోడవరం, సెప్టెంబర్ 24: జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం మండలంలోని వివిధ పాఠశాలలను, గవరవరం పిహెచ్‌సిని సందర్సించారు. వైద్య, ఉపాధ్యాయ సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తంచేశారు. ప్రధానంగా వెంకన్నపాలెం, గవరవరం ప్రాథమిక పాఠశాలల్లో లోపించిన పారిశుద్ధ్యంపై ఆయన సంబంధిత ఉపాధ్యాయ సిబ్బందిని నిలదీశారు.

09/25/2016 - 05:29

రావికమతం, సెప్టెంబర్ 24: వ్యాధి నిర్ధారణ కాకుండా డెంగ్యూ జ్వరమని రోగులను భయబ్రాంతులకు గురి చేసే వైద్యులు, మెడికల్ ల్యాబ్‌లపై చర్యలు తప్పవని డి. ఎం. అండ్.హెచ్. ఓ.జి.సరోజిని హెచ్చరించారు. మండలంలో రావికమతం, గర్నికం గ్రామాల్లో డెంగ్యూ జ్వరం సోకి నయం అయిన వారి ఇళ్ళకు డి.ఎం.అండ్.హెచ్. ఓ. శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పగటిపూట కుట్టే ఎలీషియా దోమ వలన డెంగ్యూ సోకుతుందన్నారు.

09/25/2016 - 05:29

విశాఖపట్నం, సెప్టెంబరు 24: జివిఎంసి ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలోగా ఎన్నికల తంతు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు జివిఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అంతర్గత కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని వైకాపా అధినేత జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

09/25/2016 - 05:27

నరసన్నపేట, సెప్టెంబర్ 24: దోమల నివారణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు అయితే పరిశుభ్రత పాటించగలిగితే దోమలపై దండయాత్ర చేసినట్టే అని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన దోమలపై దండయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

Pages