S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బంగారు రథంపై ఊరేగిన శ్రీ ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, ఆగస్టు 4: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో గురువారం శ్రీ ప్రహ్లాద రాయలను ఘనంగా బంగారు రథోత్సవంపై ఊరేగించారు. మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యే క పూజలు చేశారు. బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఉంచి మఠం ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం పీఠాధిపతి శ్రీ మూల రామ దేవతా మూర్థుల కు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. గురువారం స్వామి వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవతకు కుంకుమ, పసుపును సమర్పించి ప్రత్యేక పూజలు చేసి, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి మఠంలో శ్రీ ప్రహ్లాద రాయలను వెండి, బంగారు పల్లకిలో ఊరేగించి అనంతరం గజవాహనం, వెండి, బంగారు రథాలపై అధిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి మఠం ప్రాకారంలో అశేష భక్తులు నడుమ వైభవంగా ఊరేగించారు. ఉదయం శ్రీ మఠంలో పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు చాతుర్మాస ధీక్షలో బాగంగా ఈశావాశ్వోపనిషత్ ఖండార్థ సంబంధిత పాఠాలను వేద విద్వాన్ పండితులు మధ్య ఉపన్యాసం నిర్వహించారు. ఈకార్యక్రమంలో రాష్టప్రతి అవార్డు గ్రహీత విద్వాన్ రాజాఎస్ గిరియాచార్, మఠం మేనేజర్ శ్రీనివాసరావు, సంస్కృత పాఠశాల ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, పండితులు పాల్గొన్నారు.