S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పర్యావరణ పరిరక్షణ లక్ష్యం కావాలి

గజ్వేల్, ఆగస్ట్ 5 : పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముందకు సాగి సిఎం కెసిఆర్ కన్న కళలు నిజం చేద్దామని కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి, మెట్రో వాటర్‌వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మొక్కలు నాటడంతోపాటు ఔషధ మొక్కల పార్కును పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. బావితరాల ఆరోగ్య పరిరక్షణ, వర్షాలు సమృద్ధిగా కురవడానికి చెట్లు ఎంతో దోహదపడతాయని దానిని దృష్టిలో పెట్టుకొని ఉద్యమంలా హరితహారం కార్యక్రమం చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా గజ్వేల్ పరిదిలో లక్షా9వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే లక్షా 50వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ముఖ్యంగా 100 శాతం హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టగా, రాష్ట్రంలో బహిరంగ మలవిసర్జనపై అవగాహన కల్పించేందుకు 13 పట్టణాలు ఎంపిక చేయగా అందులో గజ్వేల్ ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే 2వ సారి మున్సిపల్ డే నిర్వహించి మొక్కలు నాటుతుండగా, ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని సూచించారు. కాగా గజ్వేల్‌లో ఔషద మొక్కల పార్క్ ఏర్పాటు చేయడం చక్కగా ఔషధ మొక్కలు నాటడం ఎంతో సంతృప్తినిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ దుంబాల అరుణబూపాల్‌రెడ్డి, కమీషనర్ శంకర్, కౌన్సిలర్‌లు నరేందర్‌రావు, శ్రవంతిశ్రీనివాస్, వసీంఖాన్, ఆర్‌కె శ్రీనివాస్, నంగునూరి విజయలక్ష్మి సత్యనారాయణ, బుచ్చమ్మ నారాయణరెడ్డి, సంతోషిని రాంచంద్రాచారి, జకియోద్దీన్, నర్సింలు, నేతలు ఆకుల దేవేందర్, నర్సింగరావులు పాల్గొన్నారు.