S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 12:48

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష బరిలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీకి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే 15 శాతం మద్దతు అధికంగా ఉన్నట్లు తెలిపింది. హిల్లరీకి 48 శాతం మంది ఓటర్ల మద్దతు ఉండగా, ట్రంప్‌కు కేవలం 33 శాతం మంది ఓటర్లు మద్దతు ఉన్నట్లు మెక్‌క్లాచీ-మారిస్ట్‌ పోల్‌ సర్వే స్పష్టం చేసింది. తాజా సర్వేలో ట్రంప్‌ మద్దతు మరింతగా పడిపోయింది.

08/05/2016 - 12:17

చెన్నై: తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలను ఒకప్పుడు గడగడలాడించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ బతికి ఉన్నపుడు ఆయన తరచూ పూజించే ఆలయానికి అధికారులు ఇపుడు తాళాలు వేశారు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని మారియమ్మన్ ఆలయంలో అమ్మవారిని పూజించి ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించడం వీరప్పన్‌కు అలవాటు. అతని కారణంగా ఆ ఆలయం రెండు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. గత మంగళవారం ఆ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు.

08/05/2016 - 12:16

హైదరాబాద్: భూసేకరణకు సంబంధించి ఇచ్చిన 123 జీవోను హైకోర్టులోని సింగిల్ జడ్డి కొట్టివేయడంతో డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ ఈరోజు విచారణకు స్వీకరించింది.

08/05/2016 - 12:15

ముంబయి: పురాతన వంతెన కూలిపోయి రెండు బస్సులు సహా పలు వాహనాలు సావిత్రి నదిలో పడిపోయిన రెండు రోజులకు 14 మృతదేహాలు లభించాయి. గల్లంతైన వారి కోసం నదిలో ఇంకా గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ముంబయి- గోవా రహదారిపై మహద్ వద్ద సావిత్రి నదిపై పురాతన వంతెన కూలిపోగా పలు వాహనాలు కొట్టుకుపోయి దాదాపు 50 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు.

08/05/2016 - 12:15

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబు ఈరోజు ఉదయం కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, ప్రకాష్ జవదేకర్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లను కలిశారు. కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా వారిని ఆయన ఆహ్వానించారు. కాసేపట్లో ప్రధాని మోదీని చంద్రబాబు కలిసి పుష్కరాలకు ఆహ్వానిస్తారు.

08/05/2016 - 12:15

హైదరాబాద్: జిహెచ్‌ఎంసిలో ఖైరతాబాద్ సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్‌కు చెందిన ఇళ్లపై శుక్రవారం ఉదయం ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ఇంతవరకూ కోటి రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించి సోదాలు కొనసాగిస్తున్నారు. డిడి కాలనీ, అల్వాల్, గుడిమల్కాపూర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో సంతోష్‌కు స్థిరాస్తులున్నట్లు గుర్తించారు.

08/05/2016 - 12:05

హైదరాబాద్ : . ఏపీ సచివాలయం ఉద్యోగులు వెలగపూడికి తరలివెళ్తూ ఉండటంతో వారికి వీడ్కోలు విందు ఇవ్వాలని తెలంగాణ సచివాలయం ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరురాష్ట్రాల సీఎస్‌లు, అతిథులుగా ఉన్నతాధికారులు, అధికారులు హాజరుకానున్నారు. సచివాలయంలోని బతుకమ్మ ప్రాంగణంలో ఏపీ ఉద్యోగులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

08/05/2016 - 12:00

తిరుమల:ఇకపై 90 రోజులు ముందుగానే శ్రీవారి సేవా టికెట్లను అందజేయనున్నట్లు, ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు శుక్రవారం ఉదయం తెలిపారు. నమూనా ఆలయంలో ఉదయం7 నుంచి 9వరకు భక్తులకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాగి డాలర్లను నమూనా ఆలయం వద్ద విక్రయిస్తామని చెప్పారు. 40కోట్లతో బర్డ్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేయనున్నట్లు ఈవో ప్రకటించారు.

08/05/2016 - 11:49

ఖమ్మం: మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం గుండెపోటుతో కొత్తగూడెంలో కన్నుమూశారు. కోనేరు మృతి పట్ల మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర, టీడీపీ నేత తుళ్లూరి భద్రయ్య సంతాపం తెలిపారు.

08/05/2016 - 11:49

ముంబై : శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.86 పైసలుగా ఉంది. సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది.

Pages