S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 04:45

విజయవాడ, ఆగస్టు 4: పట్టిసీమ ప్రాజెక్టుతో గోదావరి, కృష్ణా జిల్లాల్లో భూగర్భ నీటి మట్టాలు పెరిగినట్టు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. క్యాంపు ఆఫీసులోని తన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రధాన కుడికాలువ ప్రవహించే పశ్చిమ గోదావరి జిల్లా తోటగొంది నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ఫెర్రి పరిసర ప్రాంతాల వరకు కూడా భూగర్భ నీటి మట్టాలు 3 శాతం వరకు పెరిగినట్టు తెలిపారు.

08/05/2016 - 04:44

విజయవాడ, ఆగస్టు 4: పుష్కర విధులకు తరలివచ్చే అధికారులు, సిబ్బందితో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం స్థానిక సిద్ధార్థ నగర్ ఎ - ప్లస్ ఆడిటోరియంలో ముఖాముఖి నిర్వహించనున్నారని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాట్లను గురువారం ఎ - ప్లస్ ఆడిటోరియంలో సబ్ కలెక్టర్ సృజనతో కలిసి సమీక్షించారు.

08/05/2016 - 04:42

హైదరాబాద్, ఆగస్టు 4: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు అనుసంధానంగా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ బైక్‌లు కూడా అందుబాటులో ఉండబోతున్నాయి.

08/05/2016 - 04:39

హైదరాబాద్, ఆగస్టు 4: మహానగరంలో మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం జిహెచ్‌ఎంసి రికార్డు స్థాయిలో మొక్కలు నాటేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని దాటింది. జూలై 11వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే!

08/05/2016 - 04:38

ఖైరతాబాద్, ఆగస్టు 4: సిలబస్ పూర్తికానందున తెలంగాణ అంబేద్కర్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మరో ఏడాది పాటు శిక్షణ ఇవ్వాలని జెఎసి చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలంటూ బంజారాహిల్స్‌లోని అంబేద్కర్ స్టడీ సెంటర్ విద్యార్థులు కొంత కాలంగా దీక్ష చేస్తున్నారు. గురువారం దీక్షా శిబిరాన్ని కోదండరామ్ సందర్శించారు.

08/05/2016 - 04:37

ఘట్‌కేసర్, ఆగష్టు 4: తల్లి దండ్రులు, గురువుల పట్ల గౌరవం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ప్రముఖ మానసిక నిపుణుడు బివి పట్ట్భారామ్ అన్నారు. మండల పరిధి ఘనపూర్ గ్రామంలోని కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఓరియేంటేషన్ కార్యక్రమం జరిగింది.

08/05/2016 - 04:36

ఖైరతాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 6న నగర టిడిపి ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించనున్నట్టు టిఎన్ టియుసి అధ్యక్షుడు బిఎన్ రెడ్డి తెలిపారు. గురువారం ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అభిష్టాలకు విరుద్ధంగా పాలన కొనసాగుతుందని అన్నారు.

08/05/2016 - 04:36

జీడిమెట్ల, ఆగస్టు 4: విద్యార్థులు సంకల్పంతో విద్యనభ్యసించాలని విజ్యాన్ జ్యోతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డిఎన్ రావు సూచించారు. నగర శివారులోని బాచుపల్లి విఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇండక్షన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న డిఎన్ రావు మాట్లాడుతూ ముందుగా నూతన విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులు శ్రమ, శ్రద్ధ, సహనంతో విద్యను అభ్యసించాలని అన్నారు.

08/05/2016 - 04:33

హైదరాబాద్, ఆగస్టు 4: ప్రతి నెల కోట్లలో విద్యుత్ బిల్లులను చెల్లిస్తోన్న గ్రేటర్ హైదరాబాద్ ఇప్పటికే పొదుపు మంత్రాన్ని జపిస్తూ సుమారు 30 శాతాన్ని ఆదా చేసుకుంటున్న సంగతి తెలిసిందే! ఈ ఆదాను మరింత పెంచుకునేందుకు గాను జిహెచ్‌ఎంసికి చెందిన అన్ని కార్యాలయాల్లో త్వరలో ఎల్‌ఇడి లైట్లను వినియోగించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి నిర్ణయించారు.

08/05/2016 - 04:33

శామీర్‌పేట, ఆగస్టు 4: ఆగి ఉన్న లారీని డిసిఎం ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్రగాయాలైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం తూంకుంట శివారు దొంగల మైసమ్మ దగ్గరలోని డోమూస్ చౌరస్తా వద్ద పిబి 12 క్యూ 0935 నెంబర్ గల లారీ ఆగి ఉంది.

Pages