S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యార్థులు సంకల్పంతో విద్యనభ్యసించాలి

జీడిమెట్ల, ఆగస్టు 4: విద్యార్థులు సంకల్పంతో విద్యనభ్యసించాలని విజ్యాన్ జ్యోతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డిఎన్ రావు సూచించారు. నగర శివారులోని బాచుపల్లి విఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇండక్షన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న డిఎన్ రావు మాట్లాడుతూ ముందుగా నూతన విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులు శ్రమ, శ్రద్ధ, సహనంతో విద్యను అభ్యసించాలని అన్నారు. భావి ఉత్తమ ఇంజనీర్లుగా ఎదగడానికి విద్యార్థి దశలోనే బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మంచి శిక్షణ అందించడంలో తమ కళాశాల ముందుంటుందని చెప్పారు. విజ్ఞాన్ జ్యోతి ప్రదాన కార్యదర్శి బి.శరత్‌గోపాల్ మాట్లాడుతూ క్రమశిక్షణ చదువు పట్ల శ్రద్ధతో విద్యార్థులు ముందుకు వెళ్లాలని అన్నారు. విజ్ఞానం, సంకల్పం, పట్టుదల ఉంటే విద్యార్థులు భవిష్యత్తులో బంగారు బాటగా మార్చుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు జీవితంలో ఎదగడంతో పాటు సమాజానికి సేవలను అందించాలని సూచించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ జ్యోతి చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అధికారి శుభానందరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిడి నాయుడు, డైరెక్టర్‌లు ఎఎస్ రావు, కోడె సంధ్య పాల్గొన్నారు.