S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారు

గజ్వేల్, ఆగస్ట్ 4 : జిఒ 123ని కోర్టు రద్దు చేసినందున టిఅర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా బలవంతపు భూసేకరణకు స్వస్తి చెప్పాలని, అవసరమైన పక్షంలో 2013 చట్టం ప్రకారం వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్‌ఖాన్, నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మెన్ రామరాజశర్మ, ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షులు గాలెంక నర్సింలు స్పష్టం చేశారు. గురువారం గజ్వేల్‌లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్న సందర్బంగా వారు మాట్లాడారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలలో రైతులు స్వచ్చందంగా భూములు అప్పగిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొనడం దురదృష్టకరమని, అయితే 2013 జిఒ వర్తింపజేయాలని కోర్టు స్పష్టం చేయడంతో నిర్వాసితులు సంబరాలు చేసుకుంటున్న విషయాన్ని గమనించాలని సూచించారు. ముఖ్యంగా ఎలాంటి సాగునీటి వనరులులేని ప్రాంతంలో మల్లన్నసాగర్ నిర్మించడంలో అంతర్యమేమిటని, ఎత్తిపోతల ద్వారా నీటిని నింపుతామని బావిస్తే అది వారి బ్రమే అవుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు గుంటుకు మల్లేషం, చంద్రంగౌడ్, ఎక్బాల్, గుంటుకు శ్రీనివాస్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.