S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 06:52

హైదరాబాద్, ఆగస్టు 2: ఎమ్సెట్-2 నిర్వహణలో రోజురోజుకూ అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఎమ్సెట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు రిజిస్టర్డ్ బిడ్డర్ల మధ్య పోటీతో ఈ అక్రమాలు ఒకొక్కటీ బయటపడుతున్నాయి. ప్రధానంగా డేటామెథడెక్స్, మాగ్నటిక్ ఇన్ఫోటెక్ లిమిటెడ్‌ల మధ్య పోరుతో పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నత విద్యా మండలికి అనేక ఫిర్యాదులు వచ్చాయి.

08/03/2016 - 06:51

హైదరాబాద్, ఆగస్టు 2: నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసిని లాభాల బాటలో నడిపించేందుకు కృషి సల్పుతున్నామని, రూ. 5 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సంస్థను పటిష్టం చేయనున్నట్టు టిఎస్‌ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం బస్‌భవన్‌లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లతో కలసి సమావేశమైన చైర్మన్ ఆర్టీసి పురోభివృద్ధిపై చర్చించారు.

08/03/2016 - 06:51

హైదరాబాద్, ఆగస్టు 2: అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సెర్ఫ్ సిఇఓ పౌసమిబసుతో వేతనాల పెంపుపై క్యాంపు కార్యాలయం మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.

08/03/2016 - 06:50

హైదరాబాద్, ఆగస్టు 2: గిరిజన తండాలు, గూడెంలలో వైద్య సేవలను మరింతగా విస్తృత పరచాలని గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో వైద్య సహాయంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, ఇతర విష జ్వరాలు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

08/03/2016 - 06:49

హైదరాబాద్, ఆగస్టు 2: మూడు తెలంగాణ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో 125 ఆరోగ్య ఉపకేంద్రాలకు భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేసింది. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంగళవారం ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

08/03/2016 - 06:41

న్యూఢిల్లీ, ఆగస్టు 2:టిడిపికి చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ తెర వెనక చేసిన ప్రయత్నం మూలంగానే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం లోక్‌సభలో ప్రకటన చేశారనే మాట వినిపిస్తోంది.

08/03/2016 - 06:40

న్యూఢిల్లీ, ఆగష్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు,ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలను తాత్కాలిక విరమిస్తున్నట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. టీడీపీ ఎంపీలతో కలసి ఆయన ఏపీభవన్‌లో విలేఖరులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని లోక్‌సభలో అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని, అందుకే తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించామని తెలిపారు.

08/03/2016 - 06:39

న్యూఢిల్లీ,ఆగస్టు 2: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కుమ్మక్కు అయినందుకే ఏపికి ప్రత్యేక హోదా రావటం లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యు డు ఎం.ఏ.ఖాన్ ఆరోపించారు.

08/03/2016 - 06:38

న్యూఢిల్లీ,ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు లోక్‌సభలో తమ ఉద్యమం కొనసాగుతుందని వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు సుబ్బారెడ్డి ప్రకటించారు. లోక్‌సభలో తాము లేనప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జేట్లి ఏపికి ప్రత్యేక సహాయం గురించి ప్రకటించటం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని ఆయన మంగళవారం విలేఖరులతో అన్నారు.

08/03/2016 - 06:38

న్యూఢిల్లీ,ఆగష్టు 2:ఏపీ విభజన చట్టంలో హామీలు ఇచ్చి, ఎన్నికలకు ముందు వాగ్దానాలూ చేసినప్పుడు మళ్లీ పార్లమెంట్‌లో చర్చలెందుకని వైకాపా ఎంపీలు ప్రశ్నించారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,సుబ్బారెడ్డి,బుట్టా రేణుక,వరప్రసాద్‌రావులు విలేఖరులతో మాట్లాడారు.

Pages