S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 03:31

శ్రీకాకుళం, ఆగస్టు 2: జిల్లా అంతటా ప్రత్యేక హోదా నిరసనలు హోరెత్తాయి. బిజెపి, టిడిపి తీరును నిరసిస్తూ వైకాపా రాష్టబ్రంద్ పిలుపు మేరకు జిల్లా బంద్ విజయవంతమైంది. వామపక్షాలతో సహా కాంగ్రెస్, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. కానీ, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించిన జిల్లా ఎన్జీవో నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు ఈ బంద్‌లో పాల్గొనలేదు.

08/03/2016 - 03:31

లావేరు, ఆగస్టు 2: జిల్లాలో భూగర్భజలాలు అభివృద్ధి చేసేలా రైతులు కృషి చేయాలని, అప్పుడే మానవునికి మనుగడ ఉంటుందని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. మండలంలో తామాడ పంచాయతీ పరిధిలోని కొత్తరౌతుపేట గ్రామంలో చంద్రన్న చెరువు పనులు పరిశీలించారు. నీరు-చెట్టు పథకంలో భాగంగా రూ.9.90లక్షలనిధులతో చేపట్టిన చెరువు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

08/03/2016 - 03:30

సోంపేట/వజ్రపుకొత్తూరు, ఆగస్టు 2: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మంగళవారం నిర్మాణంలో ఉన్న భవనం కూలిన దుర్ఘటనలో మృతి చెందిన కూలీల్లో సోంపేట, వజ్రకొత్తూరు మండలాలకు చెందిన ఇద్దరు ఉన్నారని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సోంపేట మండలం జంకిభద్ర గ్రామానికి చెందిన ఎం.్ధర్మారావు, వజ్రకొత్తూరు మండలం గుల్లలపాడు గ్రామానికి చెందిన బగాది నాగభూషణం ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

08/03/2016 - 03:29

శ్రీకాకుళం, ఆగస్టు 2: పిల్లలకు అక్షరాలు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు విద్యాయేతర విధులు నిర్వర్తించరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన హుకుం మేరకు జిల్లాలో ఐదుగురు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత కార్యదర్శులుగా ఉండరాదంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశాలు జారీ చేశారు.

08/03/2016 - 03:29

టెక్కలి, ఆగస్టు 2: మూడేళ్ళ నుంచి పరిచయం ఉన్న స్నేహితుడు ఫోన్‌లో మాట్లాడలేదని ఆత్మహత్యకు పాల్పడింది ఓ విద్యార్థిని. స్థానిక ఎన్‌టిఆర్ నగర్‌కు చెందిన జి.దేవిశ్రీ(19) మంగళవారం తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్‌హుక్‌కు చీరతో ఉరివేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. దేవిశ్రీ స్థానిక డిగ్రీకాలేజిలో రెండో ఏడాది చదువుతోంది.

08/03/2016 - 03:28

శ్రీకాకుళం, ఆగస్టు 2: శాలిహుండాంను ప్రత్యేక బౌద్ధ రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర శాసన సభ ప్రివిలేజెస్ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు అన్నారు. జిల్లా పర్యటనకు మంగళవారం విచ్చేసిన కమిటీ గార మండలంలో శాలిహుండం బౌద్ధారామాన్ని, మ్యూజియం, శ్రీకూర్మం, అరసవల్లి దేవస్థానాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శాలిహుండంను నిశితంగా పరిశీలించారు.

08/03/2016 - 03:28

నరసన్నపేట, ఆగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తన హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బగ్గురమణ మూర్తి అన్నారు.

08/03/2016 - 03:27

ఆమదాలవలస, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైసిపి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ పిలుపుమేరకు మంగళవారం నిర్వహించిన పట్టణ బంద్ కార్యక్రమంలో రాష్ట్ర మాజీమంత్రి తమ్మినేని సీతారాంను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం విడుదల చేశారు.

08/03/2016 - 03:27

ఇచ్ఛాపురం, ఆగస్టు 2: ఇచ్ఛాపురంలో సంచలనం సృష్టించిన గుట్కా స్వాధీనం కేసులో ప్రధాన నిందితుడు ఎన్.హేడంబరావు అలియాస్ పెదబాబును పట్టణ ఎస్‌ఐ రాము మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు మూడు విడతల్లో దాదాపు మూడున్నర కోట్ల రూపాయల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకోగా, గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. రెండు కేసుల్లో పెదబాబు పలాస కోర్టులో లొంగిపోయి బెయిల్ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

08/03/2016 - 03:26

గార, ఆగస్టు 2: సముద్రంలో చేపలవేట సాగిస్తూ ప్రమాదవ శాత్తు జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుడు శివకోటి శ్రీరాములు ఆచూకీ లభించని నేపథ్యంలో గాలింపు ముమ్మరం చేశామని ఫిషరీస్ డి.డి. వి.వి.కె.మూర్తి స్పష్టం చేశారు. మండలం బందరువానిపేటలో బాధిత కుటుంబాన్ని ఓదార్చి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులను ఉద్ధేశించి డి.డి.

Pages