S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 06:37

హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయటం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుందని ఎపిసిసి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎస్. శైలజానాథ్ అన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చేసిన ప్రకటనపై డాక్టర్ శైలజానాథ్ మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

08/03/2016 - 06:36

న్యూఢిల్లీ, ఆగస్టు 2: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ స్థానే కొత్త సిఎంను ఎన్నుకునే అంశాన్ని బుధవారం జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. ఆనందీ రాజీనామాను ఆమోదించడంతో పాటు కొత్త సిఎంగా ఎవర్ని నియమించాలన్న దానిపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

08/03/2016 - 06:30

హైదరాబాద్, ఆగస్టు 2: ఈ నగరానికి ఏమైంది. రికార్డుల్లో దూసుకుపోతోంది. కండల వీరుడు రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్‌గా ఎంపికైతే, పారిశుద్ధ్య కార్మికుడు టి వెంకటయ్య ఒకే ఒక్కడిగా నిలిచాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు వారధిగా నిలిచి, జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడు పురస్కారానికి ఎంపికయ్యాడు.

08/03/2016 - 06:25

హైదరాబాద్, కెపిహెచ్‌బి కాలనీ, ఆగస్టు 2: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణంలోవున్న కమాన్ (ఆర్చ్ గేట్) కుప్పకూలింది. ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

08/03/2016 - 06:22

హైదరాబాద్, ఆగస్టు 2: ఢిల్లీ కేంద్రంగా ఎమ్సెట్ ప్రశ్నాపత్రాల లీకేజి రాకెట్ పని చేసిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లీకుకు ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్‌సింగ్, ఇక్బాల్‌లు ప్రధాన సూత్రధారులుగా తేలిందన్నారు.

08/03/2016 - 06:21

గత్యంతరం లేకనే ఎమ్సెట్-2 రద్దు ఎమ్సెట్-3 నిర్వహణ బాధాకరమే సహృదయంతో సహకరించండి
లీక్ జరిగితే తప్పని అవస్థ ఇది పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పని లేదు కేంద్రాలకు ఉచిత ప్రయాణం
ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్ రెడీ జెఎన్‌టియుకే పరీక్ష నిర్వహణ బాధ్యత మరోసారి ఎమ్సెట్‌పై సిఎం కెసిఆర్

08/03/2016 - 06:11

విజయవాడ, ఆగస్టు 2: ‘విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కాంగ్రెస్ చేసిన తప్పిదాలను ప్రజలకు ఎత్తిచూపి, వారిని చైతన్యవంతులను చేయబట్టి టిడిపి, బిజెపి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చాలి. లేకుంటే ప్రజలకు అన్యాయం చేసిన వారమవుతాం. రాష్ట్ర ప్రయోజనాలను ఆశించే నేను కేంద్రానికి సహకరిస్తున్నాను.

08/03/2016 - 06:08

న్యూఢిల్లీ, ఆగస్టు 2:‘ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన చేస్తాం. అంతవరకు ఎంపిలు ఓపిక పట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించటంతో లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎంపిలు తమ నిరసన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

08/03/2016 - 05:36

హైదరాబాద్, ఆగస్టు 2: ఎట్టకేలకు తెలంగాణ ఎమ్మెట్-3 షెడ్యూలు ఖరారైంది. ఎమ్సెట్-2 పేపర్ లీక్ కావడంతో మరోసారి పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఎమ్సెట్ -3 పరీక్ష కన్వీనర్‌గా జెఎన్‌టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్యను నియమించింది. గతంలో జారీ చేసిన హాల్‌టిక్కెట్‌తోనే అభ్యర్థులు పరీక్షకు హాజరుకావచ్చు.

08/03/2016 - 05:29

న్యూఢిల్లీ, ఆగస్టు 2:గత కొన్ని నెలలుగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వివాదానికి కారణమవుతున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)బిల్లు బుధవారం పార్లమెంట్‌లో చర్చకు రానుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బిల్లుకు పెద్దల సభ ఆమోద ముద్ర వేయించుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అన్ని పక్షాల మద్దతు లభించగలదన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.

Pages