S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 05:26

హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిన బిజెపి వైఖరిని చూసి ఐదు కోట్ల ఆంధ్రుల రక్తం మరుగుతోందని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను ఆంధ్రాకు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు విజయవంతమైందన్నారు.

08/03/2016 - 03:39

విశాఖపట్నం, ఆగస్టు 2: విశాఖ మెట్రోరైలుకు మంచి రోజులు వస్తున్నాయా! జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఔననే అన్పిస్తోంది. విభజనకు ముందు విశాఖలో మెట్రోరైల్ నిర్మాణానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓకె చెప్పింది. అనంతరం కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెట్రోరైల్ ప్రతిపాదన శరవేగంతో తెరమీదకొచ్చింది.

08/03/2016 - 03:38

విశాఖపట్నం, ఆగస్టు 2: భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్టులకు మళ్ళీ కదలిక వచ్చింది. ఈ నెల 22వ తేదీన ప్రాజెక్టు పనులకు సంబంధించి టెండర్లు ఆహ్వానిచ్చింది. దీని తదువాత ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి ప్రక్రియ పూర్తయితే డిసెంబర్ నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసి) నిర్ణయించింది.

08/03/2016 - 03:37

జగదాంబ, ఆగస్టు 2: పాత నగరం బురుజుపేటలో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 3 నుంచి శ్రావణమాస పూజలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇఓ ఎస్‌జి మాధవి తెలిపారు. నెల రోజులపాటు జరిగే ఈ శ్రావణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

08/03/2016 - 03:37

జగదాంబ, ఆగస్టు 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల పనితీరుపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పథకాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? అర్హులకు అందుతున్నాయా? లేదా తదితర వివరాలను ఫొటోలతో సహా ఆధారాలు తీసుకెళుతున్నారు.

08/03/2016 - 03:36

విశాఖపట్నం, ఆగస్టు 2: ట్రయిల్ రన్‌కే పరిమితమైన డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టనుంది. కృష్ణా పుష్కరాలు పూర్తయిన తరువాతనే దీనిని నిర్వహిస్తారని తెలిసింది. ఊహించని విధంగా ఇటీవల విశాఖ రైల్వేస్టేషన్‌కు వచ్చిన డబుల్ డెక్కర్ రైలు ట్రయిల్ రన్ నిర్వహించుకుని వచ్చిన రోజునే తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి దాని జాడే లేకపోవడంపట్ల ప్రయాణికులు నిరాశ చెందుతున్నారు.

08/03/2016 - 03:35

పాడేరు, ఆగస్టు 2: గిరిజనులలో అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావడం ద్వారానే మన్యంలో ప్రాణాంతక వ్యాధులను నివారణ సాధ్యమని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేసారు. స్థానిక పి.ఎం.ఆర్.సి. కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన్యంలో వ్యాధుల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఎపిడమిక్‌ను ఎదుర్కొనేందుకు కార్యచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు.

08/03/2016 - 03:34

అనకాపల్లి, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగాను, సంపూర్ణంగాను జరిగింది. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అన్నివర్గాల వారు స్వచ్చందంగా తమ వ్యాపారాలను ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు.

08/03/2016 - 03:33

సీలేరు, ఆగస్టు 2: ఆంధ్రా - ఒడిషా సరిహద్దుల్లో జోరున వానలు కురుస్తున్నప్పటికీ పి. ఎల్.జి. ఎ. వారోత్సవాలు మావోయిస్టులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆంధ్రా - ఒడిషా, మల్కన్‌గిరి, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో అమరులైన మావోయిస్టులకు విప్లవ జోహార్లు అర్పించారు. ఈకార్యక్రమాలకు భారీ ఎత్తున గిరిజనులు హాజరయ్యారు. ఒక పక్క వర్షం , మరో పక్క మావోలు వారోత్సవాలు నిర్వహిస్తుండడంతో పోలీసులను కలవరపాటుకు గురి చేస్తుంది.

08/03/2016 - 03:33

పాడేరు, ఆగస్టు 2: పాడేరు ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్యం లోపించడంపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం, అసహనాన్ని వ్యక్తం చేసారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఏజెన్సీలో మంగళవారం పర్యటించిన ఆయన స్థానిక ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసారు.

Pages