S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 07:27

న్యూఢిల్లీ,ఆగస్టు 2: 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొనలేదని కేంద్ర ఆర్థికశాఖ సహయమంత్రి అర్జున్ సింగ్ మేఘ్‌వాల్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు భర్తీకి టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజి వెంకటేశ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పుర్వక సమాధానం ఇచ్చారు.

08/03/2016 - 07:26

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణకు కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో కోట్లు స్వాహా చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లు, రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ కావేటి సమ్మయ్యలతో కలిసి మంగళవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

08/03/2016 - 07:24

హైదరాబాద్, ఆగస్టు 2: మల్లన్న సాగర్ రిజర్వాయర్ బాధితులను కలిసి పరామర్శించేందుకు మలి విడత ప్రయత్నం చేయాలని, ఈ దఫా లాఠీ దెబ్బలకు, పోలీసు తూటాలకు గురైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో తాడో-పేడో తేల్చుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ గజ్వేల్ రానున్నందున అదే రోజున పెద్ద ఎత్తున చలో మల్లన్న సాగర్‌కు బయలుదేరాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

08/03/2016 - 07:24

హైదరాబాద్, ఆగస్టు 2: సాగునీటి ఎత్తి పోతల పథకాలతో విద్యుత్ వాడకంపై తప్పని సరిగా ఆడిటింగ్ జరగాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఇండియాకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ఎనర్జీ ఆడిట్ బాధ్యతలు అప్పగించాలని మంత్రి నిర్ణయించారు.

08/03/2016 - 07:23

తిరుపతి, ఆగస్టు 2 : భక్తుల కోసం శ్రీవేంకటేశ్వర స్వామి, అలుమేలు మంగమ్మ ప్రతిమలతో వెండి డాలర్లను తయారు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 5, 10 గ్రాములతో రెండు రకాలైన డాలర్లను తయారు చేస్తారు. ఇందుకోసం టిటిడి రూ.5.5కోట్ల రూపాయలను కేటాయించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

08/03/2016 - 07:19

హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల అక్రమాలను సహించేది లేదని ఏపి పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత హైదరాబాద్ సచివాలయంలో చెప్పారు. 13 జిల్లాల జెసి, డిఎస్‌ఓ, ఎఎస్‌ఓ, ఎంఆర్‌ఓ, టిడిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా డీలర్ల మార్జిన్ పెంపు, ఫోటోలు లేని కార్టుల అప్‌లోడ్, మీ ఇంటికే మీ రేషన్, బెస్టు ఫింగర్ డిటెక్షన్‌లో ప్రగతి, డమీ రేషన్ షాప్‌ల మూసివేత తదితర అంశాలపై చర్చించారు.

08/03/2016 - 07:18

హైదరాబాద్, ఆగస్టు 2: కృష్ణానదిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సెక్యూరిటీ మెష్‌లు ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి మంగళవారం నల్లగొండ, మహబూబ్‌నగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎస్ సమీక్షించారు. కృష్ణా పుష్కరాలు సమీపించడంతో పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేయాలని రాజీవ్ శర్మ ఆదేశించారు.

08/03/2016 - 06:59

హైదరాబాద్, ఆగస్టు 2: గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల రెండు నదులకూ వరద తాకిడి ఎక్కువగా ఉంటుందని కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) హెచ్చరించింది. ఈమేరకు మంగళవారం సిడబ్ల్యుసి ప్రత్యేక వరద హెచ్చరిక జారీ చేసింది.

08/03/2016 - 06:54

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకేజిపై దర్యాప్తు చేస్తున్న సిఐడి తీరును పర్యవేక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎమ్సెట్ ప్రశ్నాపత్రం లీకైనందువల్ల తాజాగా నోటిఫికేషన్‌ను ఆదేశించాలని, సిఐడి దర్యాప్తును పర్యవేక్షించాలని కోరుతూ ఎస్ మహేందర్ రాజు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది.

08/03/2016 - 06:53

ముషీరాబాద్/హైదరాబాద్, ఆగస్టు 2: ప్రభుత్వ రంగ సంస్థల విభజన సంపూర్ణంగా జరగాలని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడతోనే కులవృత్తులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిలకడ సాధ్యమని తేల్చి చెప్పారు.

Pages