S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 08:17

హైదరాబాద్, జూలై 24: ‘ప్రధాని నరేంద్ర మోదీ వౌన స్వామి కాదు..’ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.రాంమాధవ్ అన్నారు. నగరంలోని సత్యసాయి నిగమాగమంలో ‘లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్, వాట్ నెక్స్ట్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు రాం మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాం మాధవ్ ప్రసంగిస్తూ సభికులను ఉర్రూతలూగించారు.

07/25/2016 - 08:17

సంగారెడ్డి, జూలై 24: మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కేవలం ప్రతిష్టగా భావించి అమాయక రైతులపై దౌర్జన్యానికి దిగి, తప్పకుండా ప్రాజెక్టును కట్టితీరుతామంటూ లాఠీచార్జీ ద్వారా సంకేతాన్ని పంపిస్తోందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు.

07/25/2016 - 08:07

న్యూఢిల్లీ, జూలై 24: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రముఖ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రధానంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

07/25/2016 - 08:00

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూలై 24: హైదరాబాద్ ఫిలింనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శ్లాబ్‌తోపాటు 14 పిల్లర్లు నేలమట్టమయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదంలో శిథిలాల కింద ఇద్దరు నలిగి మృతిచెందగా, 8మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించారు.

07/25/2016 - 07:56

శ్రీనగర్, జూలై 24: కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన ప్రవర్తనను మార్చుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హితవు పలికారు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఏవైనా సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించబోదని స్పష్టం చేశారు.

07/25/2016 - 07:54

చెన్నై, జూలై 24: చెన్నైనుంచి పోర్ట్‌బ్లెయిర్ 29 మందితో వెళ్తూ జాడతెలియకుండాపోయిన వాయుసేనకు చెందిన ఎఎన్32 విమానంకోసం నిర్విరామంగా సాగిస్తున్న గాలింపు మూడోరోజుకు చేరుకున్నప్పటికీ విమానం జాడ ఏమాత్రం తెలియకపోవడంతో గాలింపు బృందాలు ఇప్పుడు ఉపగ్రహ చిత్రాల సాయం తీసుకోవాలని భావిస్తున్నారు.

07/25/2016 - 07:52

విజయవాడ, జూలై 24: రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాద్, బెంగళూరుల్లో ఉన్న సొంత రాష్ట్ర ప్రజలు తిరిగి రాకపోవడానికి కారణం, ఏపిలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ సమస్యలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించారు. అందుకే దశల వారీగా భారీస్థాయిలో మొక్కల పెంపకం ద్వారా, రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు విజన్ 2029ను నిర్దేశించుకున్నారు.

07/25/2016 - 07:51

కుప్పం, జూలై 24: తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి-బెంగళూరు జాతీయ రహదారిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరం చెందగా 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

07/25/2016 - 07:50

ఇస్లామాబాద్, జూలై 24: ఏదో ఒక రోజు కాశ్మీర్ పాకిస్తాన్‌లో కలవడం ఖాయమంటూ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మితిమీరిన ఆకాంక్షకు అద్దం పడుతున్నాయని దేశీయ పత్రికలే దుమ్మెత్మిపోశాయి. ఈ రకమైన ప్రకటనలు చేయడం ఇటు పాకిస్తాన్‌కు, అటు కాశ్మీర్ ప్రజలకు మంచిది కాదని డైలీ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది.

07/25/2016 - 07:49

న్యూఢిల్లీ, జూలై 24: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్ కోతల గురించి అడిగేందుకు వెళ్లిన తనను హతమార్చబోయాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ను అరెస్టు చేశారు. ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఖాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు.

Pages