S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 18:31

విశాఖ: చెన్నైలోని తాంబరం వద్ద అదృశ్యమైన విమానంలో వెళుతూ ఇంతవరకూ జాడలేకుండా పోయిన ఎన్‌ఎడి ఉద్యోగుల కుటుంబాలను వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి సోమవారం పరామర్శించారు. విమానం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నందున అధైర్య పడవద్దని ఆయన అన్నారు. మర్రిపాలెం, బుచ్చిరాజుపాలెం, మాధవధార తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

07/25/2016 - 18:30

హైదరాబాద్: తెలంగాణలో ఆరు వర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు వర్సిటీకి డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, జెఎన్‌టియుకి వేణుగోపాలరెడ్డి, తెలంగాణ వర్సిటీకి సాంబశివరావు, కాకతీయ వర్సిటీకి సాయన్న, ఓయుకి రామచంద్రం, ఆర్‌జియుకెటికి సత్యనారాయణలను వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

07/25/2016 - 18:30

హైదరాబాద్: వైస్ చాన్సలర్ల నియామకాలకు సంబంధించిన కేసు విచారణలో ఉండగా ఆరు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించడం ఏమిటని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లకు పైగా ఆగిన ప్రభుత్వం వీసీల నియామకంపై రెండు, మూడు రోజులు ఆగలేదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.

07/25/2016 - 18:29

జైపూర్: పోలీసులపైకి కాల్పులు జరుపుతూ ఖైదీలు జీపులో పారిపోతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో అయిదుగురు ఖైదీలున్నారు. రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. భూ వివాదానికి సంబంధించి పరారైన ఖైదీలు కోహినా గ్రామానికి చేరుకున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి ఖైదీలు కాల్పులు జరుపుతూ జీపులో పారిపోతుండగా మరో జీపు ఢీకొంది.

07/25/2016 - 18:29

హైదరాబాద్: బంగారు గొలుసు ఇచ్చేయాలంటూ మెడపై కత్తిపెట్టి ఆగంతకుడు బెదిరించినా ఆ మహిళ ధైర్యం చూపింది. నగరంలోని అమీర్‌పేట కుమ్మరిబస్తీలో బైక్‌పై వచ్చిన ఓ చైన్ స్నాచర్ రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళను అడ్డగించాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో చైన్‌స్నాచర్ పలాయనం చిత్తగించాడు. పెనుగులాటలో మహిళ స్వల్పంగా గాయపడింది.

07/25/2016 - 18:29

మహబూబ్‌నగర్: ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో ప్రభుత్వ నిధులను తెరాస సర్కారు కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని, కమీషన్లు దండుకుని మంత్రులు అక్రమంగా సంపాదిస్తున్నారని బిజెపి నేత నాగం జనార్దనరెడ్డి సోమవారం ఆరోపించారు. అవినీతిని వెలికి తీసి ఆ మంత్రులను జైలుకు పంపుతానని ఆయన హెచ్చరించారు. అక్రమ సంపాదనపై తప్ప తెరాస మంత్రులకు అభివృద్ధి పథకాలపై ఆసక్తి లేదన్నారు.

07/25/2016 - 18:28

హైదరాబాద్: ఫిలింనగర్‌లోని కల్చరల్ సెంటర్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన నేపథ్యంలో అధికారుల తీరుపై మున్సిపల్ మంత్రి కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.

07/25/2016 - 18:28

అమృత్‌సర్ : పంజాబ్‌కు దూరంగా ఉండాలని బిజెపి నాయకత్వం తనకు చెప్పినందువల్లే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం మీడియాకు తెలిపారు. పంజాబ్ కంటే ఏ రాజకీయ పార్టీ తనకు ఎక్కువ కాదని, సొంత ఇంటిని కాదని తాను ఎక్కడికీ పోలేనన్నారు. సొంత రాష్ట్రం,సొంత ప్రజలే తనకు ముఖ్యమన్నారు. ఎంపి పదవికి రాజీనామా చేసిన సిద్ధూ బిజెపిని మాత్రం వీడలేదు.

07/25/2016 - 18:27

మనాలి (హిమాచల్ ప్రదేశ్): ఇజ్రాయల్ దేశానికి చెందిన యువతిపై మనాలి వద్ద ఇద్దరు దుండగులు అత్యాచారం చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మనాలిలో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఇజ్రాయల్ యువతి తన స్నేహితులతో కలిసి ఆదివారం వచ్చింది. ఆమె స్నేహితులు మరో ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లగా ఆమె మనాలిలో ఉండిపోయింది.

07/25/2016 - 17:16

ఫ్లోరిడా (అమెరికా) : ఫ్లోరిడా ఫోర్ట్ మయర్స్‌లోని క్లబ్ బ్లూ‌లో కాల్పుల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 30 రౌండ్లు కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pages