S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 12:51

దిల్లీ: తమ పార్టీ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు చర్చకు రాకుండా అధికార పక్షం అడ్డుకుందని, ఈరోజైనా చర్చకు అవకాశం కల్పించాలని రాజ్యసభలో సోమవారం నాడు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. సభలో బిల్లురాకుండా అడ్డుకోవడం సరికాదని, సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ ఎంపి ఆనంద్ శర్మ అన్నారు. ఈరోజు బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

07/25/2016 - 12:50

లక్నో: కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ వ్యాన్‌ను పాసింజరు రైలు ఢీకొనగా 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. యుపిలోని బడోహి జిల్లాలో సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాన్ 19 మంది విద్యార్థులతో వెళుతుండగా కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద వారణాసి-అలహాబాద్ పాసింజరు ఢీకొట్టింది. వ్యాన్ నుజ్జునుజ్జవడంతో 8 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు.

07/25/2016 - 12:49

హైదరాబాద్: స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో సిఆర్‌పిఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం తూముకుంట వద్ద సోమవారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హడ్ కానిస్టేబుల్ ధర్మరాజు అక్కడికక్కడే మరణించాడని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

07/25/2016 - 12:49

నల్గొండ: రోడ్డుపై ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు బస్సుకింద పడి మృత్యువాత పడిన ఘటన తుర్కపల్లి మండలం నాగాయలంక తండాలో సోమవారం జరిగింది. గ్రామంలో విద్యార్థులతో బస్సు బయలుదేరగా రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడు బస్సుకింద పడి అక్కడికక్కడే మరణించాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

07/25/2016 - 12:48

దిల్లీ: ఎపికి ప్రత్యేక ప్యాకేజీ అవసరమని, ఈ విషయమై లోక్‌సభలో చర్చించాలని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు (టిడిపి) సోమవారం లోక్‌సభలో నోటీసు ఇచ్చారు. అశాస్ర్తియ పద్ధతుల్లో ఆదరాబాదరాగా రాష్ట్ర విభజన జరిగిందని, అన్ని విధాలా ఎపి నష్టపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలన్నారు.

07/25/2016 - 12:48

హైదరాబాద్: కార్పొరేటు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, కెజి నుంచి పిజి వరకూ ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం నాడు కూకట్‌పల్లిలో ఆందోళనకు దిగారు. వారు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

07/25/2016 - 12:47

సికిందరాబాద్: సికిందరాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రెండోరోజు సోమవారం నాడు రంగం కార్యక్రమం జరిగింది. అమ్మవారి భక్తురాలు స్వర్ణలత రంగం పేరిట భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని ఆమె చెప్పారు. రంగంలో భవిష్యవాణిని తెలుసుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

07/25/2016 - 12:47

విజయవాడ: మనం-వనం కార్యక్రమంలో భాగంగా ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాటిన ప్రతి మొక్కనూ పరిరక్షించుకునేలా ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తామన్నారు. హరితాంధ్రప్రదేశ్‌ను సాకారం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

07/25/2016 - 12:46

దిల్లీ: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే విందులో ఆయన పాల్గొంటారు. మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులను గవర్నర్ కలుస్తారు. విభజన సమస్యలు, నదీజలాల వివాదాలు, హైకోర్టు విభజన వంటి అంశాలను ఆయన కేంద్రమంత్రులతో చర్చించే అవకాశం ఉంది.

07/25/2016 - 12:44

జైపూర్‌: రెండు కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్‌ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. సినిమా షూటింగ్‌ కోసం 1998లో సల్మాన్‌ రాజస్థాన్‌ వెళ్లారు. జోధ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో సల్మాన్‌ రెండు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన జోధ్‌పూర్‌ కోర్టు రెండు కేసుల్లోనూ ఏడాది, ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది.

Pages