S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 07:49

న్యూఢిల్లీ, జూలై 24: ఉగ్రవాద దాడి జరిగేందుకు ఆస్కారం ఉందంటూ కేంద్ర నిఘా ఏజెన్సీలు ఢిల్లీ పోలీసులను, ఇతర సీనియర్ అధికారులను హెచ్చరించాయి. దేశ రాజధాని నగరంలోని అన్ని కీలక స్థావరాలు, ప్రాంతాల వద్ద గట్టి నిఘా, నియంత్రణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశాయి. తమకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీలోని కీలక ప్రాంతాలపై దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు స్పష్టం అవుతోందని వెల్లడించాయి.

07/25/2016 - 07:41

రాజమహేంద్రవరం, జూలై 24: తూర్పు కనుమల్లో కాంతి రేఖ విరిసింది.. ఆదివాసీ యువతులు పారిశ్రామికవేత్తలుగా ముందడుగు వేస్తున్నారు.. ఎల్‌ఇడి బల్బులు తయారుచేసే స్థాయికెదిగారు.. రంపచోడవరంలో ఎల్‌ఇడి బల్బులు తయారుచేసే ప్రాజెక్టుకు గిరిజన మహిళలే యజమానులు. రంపచోడవరం గిరిజన మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఐటిడిఏ పెట్టుబడితో, బెంగళూరుకు చెందిన సంస్థ ప్రోత్సాహంతో గిరిజన మహిళలు ఉత్పత్తిదా రులుగా మారారు.

07/25/2016 - 07:40

న్యూఢిల్లీ, జూలై 24: పదేళ్లకుపైబడిన డీజిల్ ఆధారిత వాహనాలను స్క్రాపింగ్ చేయడం ద్వారా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తగ్గుతుందంటే ఆశ్చ ర్యం అనిపిస్తోంది అని దేశీయ ఆటోరంగ దిగ్గజం మారు తి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. నిజానికి ఈ నిర్ణయం వల్ల భారత ఆటో పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక ఈ నిర్ణయం..

07/25/2016 - 07:40

న్యూఢిల్లీ, జూలై 24: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను వివిధ సంస్థలు ప్రకటించే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు, పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందగలదన్న ఆశాభావం భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులను రప్పించాయ. ఈ నెలలో ఇప్పటిదాకా 2 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ పెట్టుబడులు భారతీయ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చాయ.

07/25/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 24: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) పరిశీలనకు 12 విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు రానున్నాయి. వచ్చే నెల 2న జరిగే సమావేశంలో ఎఫ్‌ఐపిబి ఈ పనె్నండింటిని పరిశీలిస్తుంది.

07/25/2016 - 07:34

న్యూఢిల్లీ, జూలై 24: అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ఆధ్వర్యాన పోలెండ్‌లోని బిడ్గోస్క్‌లో జరుగుతున్న అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో హర్యానాకు చెందిన రైజింగ్ అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రా భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించాడు. అద్భుత ప్రదర్శనతో 86.48 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.

07/25/2016 - 07:32

న్యూఢిల్లీ, జూలై 24: రియో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న భారత క్రీడా బృందానికి ఆదివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పక్కకు నెట్టి రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో అతనిపై ప్రాథమిక సస్పెన్షన్ విధించారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

07/25/2016 - 07:32

రియో డి జనిరో,జూలై 24: రియో ఒలింపిక్స్ మరో 15 రోజుల్లో ప్రారంభమవుతుండగా ఆదివారం అథ్లెటిక్ విలేజ్ అధికారికంగా ప్రారంభమయింది. దీంతో ఒలింపిక్సలో పాల్గొనే 10 వేలకు పైగా అథ్లెట్లు, మరో 7 వేల మంది అధికారులు ఈ విలేజ్‌లోకి ప్రవేశించడం మొదలవుతుంది. వచ్చే నెల 5న గేమ్స్ ప్రారంభమయ్యే దాకా అథ్లెట్ల రాకడ కొనసాగుతూనే ఉంటుంది.

07/25/2016 - 07:31

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 24: టీమిండియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు భారీ ఓటమి దిశగా పయనిస్తోంది.

07/25/2016 - 07:30

ముంబయి, జూలై 24: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు( బిసిసిఐ) దాని అనుబంధ సంగాల్లో సమూల మార్పులను తీసుక రావాలంటూ జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫార్సులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఏ) ఆదివారం యథాతథంగా ఆమోదించింది. దీంతో ముంబయి క్రికెట్ సంఘం అధ్యక్ష పదవినుంచి శరద్ పవార్ తప్పుకోవలసి ఉంటుంది. పవార్ బిసిసిఐ అధ్యక్షుడిగా, ఐసిసి అధ్యక్షుడిగా కూడా పని చేసిన విషయం తెలిసిందే.

Pages