S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 17:14

ముజఫర్‌పూర్: ముజఫర్‌పూర్‌ ( బీహార్‌)లోని అహియాపూర్ ప్రాంతంలో సోమవారం ఆటో, బస్సు ఢీకొని 14 మంది చనిపోయారు. గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

07/25/2016 - 17:10

దిల్లీ: అత్యాచార బాధితురాలి కడుపులో పెరుగుతున్న పిండం ఆమె ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని వైద్యుల కమిటీ నివేదికతో అబార్షన్‌కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 24 వారాల గర్భవతి అయిన బాధితురాలి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం దీనిపై ముంబై వైద్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరింది. అత్యాచార బాధితురాలి కడుపులో పెరుగుతున్న పిండం అసాధారణంగా ఉందని ద్యుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.

07/25/2016 - 16:19

హైదరాబాద్: ప్రధాని మోదీ ఆగస్టు 7న తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. 7న మద్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. 1.45కి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామగుండం చేరుకోనున్నారు. అక్కడ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌, ఎఫ్‌సీఐకి శంకుస్థాపన చేస్తారు. 2.25కి ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు.

07/25/2016 - 15:59

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 292 పాయింట్లు లాభపడి 28,095 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 8,635 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.27 వద్ద కొనసాగుతోంది.

07/25/2016 - 15:40

మహబూబ్‌నగర్: మానవపాడు మండలం జల్లాపూర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. తమ బంధువును దుబాయ్ విమానం ఎక్కించిన అనంతరం ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులంతా కారులో హైదరాబాద్ నుంచి కర్నూలుకు సోమవారం ఉదయం తిరుగుప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు జల్లాపూర్ వద్ద సిమెంటు లోడుతో వస్తున్న లారీని ఢీకొంది.

07/25/2016 - 15:40

దిల్లీ: తమ పార్టీ సభ్యుడు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టడంతో రాజ్యసభలో సోమవారం గందరగోళం ఏర్పడింది. ఎపికి ప్రత్యేక హోదాకోసం పెట్టిన ప్రైవేటు బిల్లును చర్చించాలని వారు కోరారు. నిబంధనల ప్రకారం దీన్ని ఇపుడు చర్చించలేమని ఆగస్టు 6న సభలో ప్రవేశపెడతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు.

07/25/2016 - 15:39

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షలో కొన్ని అవకతవకలు జరిగినట్లు సిఐడి పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కొంతమంది దళారులు ఎంసెట్-2 పేపర్‌ను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చినందున సిఐడి విభాగం కేసు నమోదు చేసింది. పేపర్ ముద్రణ నుంచి లీకేజీ వ్యవహారం వరకూ అన్ని విషయాలపై సిఐడి దృష్టి సారించింది. సిఐడి నివేదిక వచ్చే వరకూ మెడిసిన్ కౌనె్సలింగ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

07/25/2016 - 15:39

మెదక్: మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ముంపు గ్రామాలలో మోహరించిన పోలీసు బలగాలను వెంటనే వెనక్కి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

07/25/2016 - 15:38

హైదరాబాద్: ప్రతిపక్షాలన్నీ పిలుపు ఇచ్చినప్పటికీ సోమవారం మెదక్ జిల్లా బంద్ విఫలమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన తెరాస భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్న విపక్షాలు మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందేలా వ్యవహరిస్తున్నాయన్నారు.

07/25/2016 - 15:21

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్‌ మైర్స్‌లో ఓ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. 17 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. క్లబ్‌ బ్లూలో ‘టీన్‌ నైట్‌’ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. తుపాకీ చేతబూనిన ఓ వ్యక్తి క్లబ్‌లోకి ప్రవేశించిన వెంటనే జనం పైకి కాల్పులు జరపడం ప్రారంభించాడు.

Pages