S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 07:29

న్యూఢిల్లీ, జూలై 24: అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న రైజింగ్ అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రాకు వైల్డ్‌కార్డు ద్వారా వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభయమ్యే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవకాశాన్ని కల్పించే విషయాన్ని పరిశీలించాలని భారత అథ్లెటిక్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) ఆదివారం అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య (ఐఎఎఎఫ్)కు విజ్ఞప్తి చేసింది.

07/25/2016 - 07:23

హైదరాబాద్, జూలై 24: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయు) స్థాపించి వందేళ్లు పూర్తయన సందర్భంగా వచ్చే ఏడాది శతాబ్థి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సిందిగా సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శతాబ్థి ఉత్సవాల నిర్వహణకు ఇప్పటినుంచి సన్నద్ధం కావాలన్నారు.

07/25/2016 - 07:22

సిద్దిపేట/ కొండపాక, తొగుట: జూలై 24: మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాజెక్టు వల్ల తాము భూములు కోల్పోతామనే ఆందోళనతో పెద్ద సంఖ్యలో ముంపునకు గురయ్యే గ్రామాల రైతులు ఆదివారం రాజీవ్ రహదారి ముట్టడికి బయలుదేరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులను వేములగాట్, ఎర్రవెళ్లి గ్రామాల్లో పోలీసులు చెదరగొట్టారు. ఎర్రవెళ్లి గ్రామంలో పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు.

07/25/2016 - 07:18

విజయవాడ, జూలై 24: కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఘనంగా మర్యాదలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో ఆదివారం సమీక్ష జరిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అక్షయపాత్ర, టిటిడి దేవస్థానం భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

07/25/2016 - 07:17

చెన్నై, జూలై 24: ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు ఎ కన్యాకుమారి ఈ ఏడాది మద్రాసు మ్యూజిక్ అకాడమీ ప్రతిష్ఠాత్మక సంగీత కళానిధి పురస్కారానికి ఎంపికయ్యారు. ఆదివారం ఇక్కడ సమావేశమైన కార్యవర్గం ఆమెను ఈ పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు అకాడమీ అధ్యక్షుడు ఎన్ మురళి చెప్పారు.

07/25/2016 - 07:16

హైదరాబాద్, జూలై 24: కృష్ణా జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ లేఖల యుద్ధం ప్రారంభమైంది. కృష్ణాబోర్డు అనుమతి లేకుండా, కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండా జూరాల నుంచి నాలుగు ఎత్తిపోతల పథకాలకు సాగునీటిని విడుదల చేయడం తగదని తెలంగాణపై ఏపి కేంద్రానికి ఫిర్యాదుచేసింది.

07/25/2016 - 07:15

హైదరాబాద్, జూలై 24: నూతన ఆర్థిక విధానాలు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ముఖ్యంగా సరళీకృత ఆర్థిక విధానాల వల్ల దేశంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ప్రభుత్వరంగం కంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు. రవీంద్రభారతిలో ఆదివారం సాయంత్రం జరిగిన జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాస సభకు జైట్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/25/2016 - 07:13

విశాఖపట్నం, జూలై 24:‘నాకిది పునర్జన్మ. మళ్లీ భార్యాబిడ్డల్ని చూస్తాననుకోలేదు. నా విడుదలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నా సంస్థకు చెందిన అధికారులు చూపిన చొరవ మరువరానిద’ని నైజీరియాలో కిడ్నాపర్ల చెరనుంచి విడుదలైన శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆదివారం వైజాగ్ చేరుకున్నారు. శ్రీనివాస్‌తోపాటు అవినాశ్ అనే మరో ఇంజనీర్‌ను కూడా నైజీరియాలో దుండగులు కిడ్నాప్ చేసి, 18 రోజులపాటు నిర్బంధించిన సంగతి తెలిసిందే.

07/25/2016 - 05:16

విజయవాడ నగరంలో ఆలయాల కూల్చివేత అత్యంత దారుణమైన చర్య. ఈ విషయంలో కొంతమంది నేతలు ఎనలేని ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఆలయాలను కాపాడుకోలేనప్పుడు వాటిని నిర్మించడమెందుకు? ఒకవైపు కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్న సమయంలో ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. గోశాలను కూల్చడం, విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేయడం రాజ్యానికి మంచిది కాదు.
-మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం, గుంటూరు జిల్లా

07/25/2016 - 05:14

మరో పాట, యిలా, రా.గా.- అనగా రాహుల్‌గాంధీ కునుకుపాటు మీద- లోకమంతా ఉలికిపాటు పడ్డది! వానాకాలం లోక్‌సభ చినుకుతో గాక, రా.గా. కునుకుతో మొదలైంది- అంటున్నారెవరో!

Pages