S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 03:13

అనంతపురం, జూలై 22 : ఎపిఎంఐపి ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న డ్రిప్ పరికరాల కోసం రైతులు ముమ్మరంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వర్షాభావం, అకాల వర్షాల కారణంగా ఏటా రబీ, ఖరీఫ్ సీజన్‌లలో వేరుశెనగతో పాటు ఇతర పంటలు నష్టపోతున్న జిల్లా రైతాంగం పండ్ల తోటలు, కూరగాయల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు యత్నిస్తోంది.

07/23/2016 - 03:12

అనంతపురం కల్చరల్, జూలై 22: కబాలి సినిమా విడుదల కావడంతో నగరంలోని సినిమా థియేట ర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా వివిధ భాషలలో భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైంది. దీంతో అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాశారు. నగరంలో శాంతి, గౌరి థి యేటర్లతో పాటు ఇతర థియేటర్లలో కూడా శుక్రవారం కబాలి సినిమాను ప్రదర్శించారు.

07/23/2016 - 03:11

బళ్లారి, జూలై 22 : తుంగభద్ర జలాశయం నుంచి శుక్రవారం హెచ్చెల్సీకి నీరు విడుదల చేశారు. దాదాపు వంద కూసెక్కుల నీటిని కిందకు వదిలారు. గంటగంటకూ వంద కూసెక్కుల చొప్పున గరిష్టంగా 1050 క్యూసెక్కుల నీరు పెంచుతున్నట్లు మండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయానికి 4984 కూసెక్కుల వరద వస్తుండగా 11,689 క్యూసెక్కులు కిందకు వదులుతున్నట్లు తెలిపారు. జలాశయంలో 40.388 నీటి మట్టం ఉన్నట్లు తెలిపారు.

07/23/2016 - 03:10

తాడిపత్రి, జూలై 22:తాడిపత్రిలో ప్రజస్వామ్యం ఖూనీ అయ్యిందని, నాటి నియంతల పాలన, ఎమర్జెన్సి పాలన తాడిపత్రిలో ఈనాడు నడుస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తు శుక్రవారం పెన్నానది కొత్తవంతెన వద్ద ఉన్న చెక్‌పోస్ట్‌వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.

07/23/2016 - 03:10

నల్లమాడ, జూలై 22:రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గపు పాలనతో రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయ ం జరుగుతోందని, రాజన్న రాజ్యం వచ్చినప్పుడే రాయలసీమ ప్రజానికానికి న్యాయం జరిగి సీమ అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు.

07/23/2016 - 03:08

అనంతపురం, జూలై 22 : నగరం లో గురువారం జరిగిన జంటహత్య కేసు నిందితుల కోసం ముమ్మర గాలి ంపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ మల్లికార్జునవర్మ తెలిపారు. చంద్రబాబు కొట్టాలకు చెందిన గోపీనాయక్, వెంకటేష్ నాయక్‌ను ప్రత్యర్థులు దారుణం గా నరికి చంపిన విషయం విధితమే. ఈ కేసుకు సంబంధించి డిఎస్పీ వివరాలు వెల్లడించారు.

07/23/2016 - 03:06

గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), జూలై 22: కులతత్వ రాజకీయాలను, బంధుప్రీతి రాజకీయాలను తిరస్కరించి, అభివృద్ధి రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

07/23/2016 - 03:05

బెళుగుప్ప, జూలై 22 : ఫుట్‌బాల్ క్రీడలో మెళకువలు పాటిస్తే మేటి ఆటగాళ్లుగా తయారు కావచ్చని స్పెయిన్ ఫుట్‌బాల్ కోచ్‌లు బోమ, లూకా, ఆల్బర్ట్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఆర్టీటీ సహకారంతో ఫుట్‌బాల్ కోచ్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో సుమార్ 50 మంది క్రీడాకారులకు స్పెయిన్ ఫుట్‌బాల్ కోచ్‌లతో శిక్షణ ఇప్పించారు.

07/23/2016 - 03:04

అనంతపురం సిటీ, జూలై 22:క్యూఎస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్ తాజాగా ప్రకటించిన రాంకింగ్స్‌లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి స్థానం లభించింది. ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ చేసిన మార్గనిర్థేశనంలో ఎస్కేయూకు ఈ గౌరవం దక్కింది.

07/23/2016 - 03:03

గుంతకల్లు, జూలై 22 : నిరుద్యోగానికి అనారోగ్యం తోడవడంతో జీవితంపై విరక్తి చెందిన డేనియల్(23) శుక్రవారం తెల్లవారుజామున బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కసాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు సత్యనారాయణ పేటలోని మున్సిపల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి కుమారుడు డేనియల్ డిగ్రీ వరకు పూర్తి చేశాడు. అతనికి గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా అస్వస్థతకు గురయ్యాడు.

Pages