S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/27/2018 - 01:18

విజయవాడ, మార్చి 26: రవాణా రంగంలో కొద్దిపాటి తప్పిదాలపై కూడా వాహనాలపై విధిస్తున్న ఫీజులు, పెనాల్టీలు తగ్గించాలనే డిమాండ్‌పై ఈనెల 28న చలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనరేట్‌కు సీఐటీయు అనుబంధ ఏపీ ఆటో ట్రాలీ డైవర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శివాజీ, ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ నరసింహారావు, కోశాధికారి కె.దుర్గారావు పిలుపునిచ్చారు.

03/27/2018 - 01:17

అమరావతి, మార్చి 26: విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర వైఫల్యాలను వివరించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని మంగళవారం ఉదయం సచివాలయంలో ఏర్పాటు చేసినట్లు సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు.

03/26/2018 - 02:23

విజయవాడ, మార్చి 25: మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని, తాము కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఆర్భాటంగా వైకాపా ప్రకటించి పార్లమెంట్‌లో తూతూమంత్రంగా అవిశ్వాసం నోటీసు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు.

03/26/2018 - 02:22

విజయవాడ, మార్చి 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం అందించకుండా అవమానించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అమిత్‌షా లేఖతో 5కోట్ల మంది ఆంధ్రులను అవహేళన చేసిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా అమిత్‌షా లేఖ ఉందని ఆగ్రహించారు.

03/26/2018 - 02:22

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 25: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం మొదలు రాష్ట్రంలో ప్రాజెక్టులు, పథకాల్లో వందల కోట్ల రూపాయలను దౌర్జన్యంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్థుడని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు ఆరోపించారు. సుజనా చౌదరి, దీపక్‌రెడ్డి వంటి నేరస్థులను నీ చుట్టూ ఉంచుకుని నేరస్థుడు నా దగ్గరకు రాగలడా అంటారా?

03/26/2018 - 02:21

విజయవాడ, మార్చి 25: అష్టకష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడని శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శనీయుడని, సుపరిపాలనకు ఆయన ఆద్యుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి ఆదివారం ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు విళంబి నామ సంవత్సరంలో జన్మించారని పండితులు చెబుతారని సీఎం గుర్తుచేశారు.

03/26/2018 - 02:21

విజయవాడ, మార్చి 25: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖ ఆ పార్టీ అబద్ధాల ఫ్యాక్టరీలో తయారైందని, దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. ప్రత్యేక హోదా సంగతి చెప్పమంటే ఇతర విషయాల గురించి ప్రస్తావిస్తూ సీఎంపైనే కాకుండా 5కోట్ల మంది ఆంధ్రులపై ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయనన్నారు.

03/26/2018 - 02:01

గుంటూరు, మార్చి 25: పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే దమ్ము ప్రధాని మోదీకి ఉందా? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు నిలదీశారు. ఆదివారం ఇక్కడ టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాసిన లేఖలో వాడిన పదజాలం చూస్తే ఉత్తర భారతీయ అహంభావాన్ని ప్రతిబింబించేలా ఉందని విమర్శించారు.

03/26/2018 - 03:36

శ్రీకాకుళం: రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్రులను తప్పుతోవపట్టించేందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖలు రాస్తున్నారని, ఈ వైఖరి విచారకరమని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఇంధనశాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. మిత్రపక్షాన్ని, మిత్ర ధర్మానికి ద్రోహం చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం ఎంతవరకూ సమంజషమని ప్రశ్నించారు.

03/26/2018 - 01:56

విజయవాడ, మార్చి 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంపూర్ణ మద్దతు తెలిపింది.

Pages