S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/25/2018 - 04:07

విజయవాడ, ఫిబ్రవరి 24: విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు - 2018లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కమిషనరేట్ ఇనె్వస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. శనివారం నుంచి మొదలవుతున్న సదస్సులో ఈ డెస్క్ పెట్టుబడిదారులకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడం ఎంత లాభదాయకమో చెప్పడంతో పాటు ఎంత సరళంగా పెట్టుబడి పెట్టే విధానం ఉందో కూడా వివరిస్తుంది.

02/25/2018 - 04:07

విజయవాడ, ఫిబ్రవరి 24: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ గత నెల రోజులుగా రాయలసీమలో ఐక్యంగా ఆందోళనలు చేస్తున్న న్యాయవాదులతో తక్షణం సంప్రదింపులు జరపాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బహిరంగ లేఖ రాశారు. న్యాయవాదులకు మద్దతుగా యువతీ, యువకులు, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారన్నారు.

02/25/2018 - 04:06

మడకశిర, ఫిబ్రవరి 24: కేంద్ర బడ్జెట్ సవరణలో రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించాలని, విభజన హామీలను అమలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

02/25/2018 - 04:06

విజయవాడ, ఫిబ్రవరి 24: దేశంలోనే ప్రథమంగా హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు తయారీపై ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- చెన్నై, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం- ఏపీ-అమరావతి, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)- చెన్నై మధ్య శనివారం చెన్నైలో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.

02/25/2018 - 04:05

విజయవాడ, ఫిబ్రవరి 24: అపరిష్కృత డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా 24వేల మంది కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం ఐదోరోజుకి చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెను మరింత ఉధ్ధృతం చేయాలని ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక నిర్ణయించింది.

02/25/2018 - 04:04

నంద్యాల, ఫిబ్రవరి 24: కాపులకు రిజర్వేషన్ అమలుకు ముఖ్యమంత్రికి మార్చి 31 వరకు గడువు ఇస్తున్నామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆలోగా రిజర్వేషన్లు అమలు చేయని పక్షంలో కాపు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

02/25/2018 - 04:03

విశాఖపట్నం(క్రైం), ఫిబ్రవరి 24: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన బోటు ప్రమాదంలో ఓ కార్పెంటర్ సజీవ దహనం కాగా, ముగ్గురు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. శనివారం ఇక్కడి ఫిషింగ్ హార్బర్‌లోని జెట్టీ నెంబర్ నాలుగులో ఉన్న ఎంఎం2371 నెంబర్ బోటులోకి ఆరుగురు యువకులు ప్రవేశించి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా ఇన్వర్టర్ పేలిపోయింది. దీంతో బోటులో పని చేస్తున్న వారిలో ఇద్దరు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

02/25/2018 - 04:02

విజయవాడ, ఫిబ్రవరి 24: క్రైస్తవులని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, క్రైస్తవులపై జరిగే దాడులను పట్టించుకోవట్లేదని క్రిస్టియన్ ఫోరం నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని టీడీపీ క్రిస్టియన్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ సీహెచ్ జాన్‌వెస్లీ అన్నారు.

02/25/2018 - 04:02

విజయవాడ, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకోసం, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా మార్చి 6న ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి చేపట్టిన ‘చలో ఢిల్లీ’ జయప్రదం చేయాల్సిందిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు రామకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

02/25/2018 - 03:39

ఒంగోలు, ఫిబ్రవరి 24: తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల అర్హతను బట్టి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Pages