S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/09/2018 - 03:14

అమరావతి, ఫిబ్రవరి 8: ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో నిరసనలు కొనసాగిస్తున్న టీడీపీ తాజాగా తన మిత్రపక్ష వైఖరిని తూర్పారపట్టడం చర్చనీయాంశమయింది. లోక్‌సభను వేదికగా చేసుకున్న టీడీపీ, తన ఆక్రోశం, బీజేపీ రాజకీయ వ్యూహాన్ని దుయ్యబట్టింది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, బీజేపీ రాజకీయ విధానంపై టీడీపీ తొలిసారిగా పార్లమెంటులో నిర్భయంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

02/09/2018 - 03:10

విజయవాడ, ఫిబ్రవరి 8: పెట్టుబడులను ఆహ్వానించేందుకు పది రోజులపాటు దావోస్, అమెరికా దేశాల్లో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం గన్నవరం విమానాశ్రయానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు పుష్పగుచ్ఛాలను అందజేసి ఘనస్వాగతం పలికారు.

02/09/2018 - 03:09

విజయవాడ, ఫిబ్రవరి 8: వివిధ వైద్య కళాశాలల్లో చదువుతున్న హౌస్ సర్జన్లు (ఇంటర్నీలు), పీజీ విద్యార్థులకు స్టయిపండ్ పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. 2018, 2019 సంవత్సరాలకు సంబంధించి స్టయిపండ్ పెంచాలని వైద్య విద్య విభాగం ప్రతిపాదనలు పంపింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సిఫారసులు చేసేందుకు ఒక కమిటీని ప్రభుత్వం గురువారం నియమించింది.

02/09/2018 - 03:08

విజయవాడ, ఫిబ్రవరి 8: రాజధాని అమరావతి పరిధిలో 12,732 కోట్ల రూపాయలతో వౌలిక సదుపాయాలను ఏపీ సీఆర్‌డీఏ కల్పించనుంది. ఈ మేరకు నిధులను వివిధ పద్ధతుల్లో సమీకరించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీర్‌గా వ్యవహరించేందుకు గురువారం ఆమోదం తెలిపింది.

02/09/2018 - 03:08

అమరావతి, ఫిబ్రవరి 8: ఆరు ఖండాలు, 40 దేశాల్లోని నౌకాశ్రయాల్లో మెరైన్, ఇన్‌లాండ్ టెర్మినళ్లను కలిగి, సప్లయ్ చైన్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం సుగమం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న డీపీ వరల్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో కార్యబృందం ఏర్పాటయింది. సంయుక్త కార్యబృందంలో ఏపీ ప్రభుత్వ వౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, డీపీ వరల్డ్ సీఈవో యువరాజ్ వున్నారు.

02/09/2018 - 02:54

విశాఖపట్నం, ఫిబ్రవరి 8: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ గురువారం జరిగిన రాష్టవ్య్రాప్త బంద్‌లో భాగంగా విశాఖ బంద్ విజయవంతమైంది. టీడీపీ, వైసీపీ, వామపక్ష పార్టీలు, జనసేనతోపాటు, వివిధ ప్రజా సంఘాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. తెల్లవారుజాము నుంచే వామపక్ష పార్టీలు ఆర్టీసీ బస్ డిపోల వద్ద ధర్నాకు దిగాయి.

02/09/2018 - 02:51

అమరావతి, ఫిబ్రవరి 8: రాష్ట్రానికి బీజేపీ నమ్మకద్రోహం చేసింది. విభజించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన ఆ పార్టీ మోసం చేసింది. ఇంత అన్యాయం జరుగుతున్నా టీడీపీ ఇంకా కేంద్రంలో ఉండటం ఎందుకు? కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తున్నందుకే నిధులివ్వడం లేదు. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎందుకు తెగించడం లేదు?.. ఇవీ బంద్ రోజు వివిధ వర్గాల నుంచి వినిపించిన ప్రశ్నలు.

02/09/2018 - 02:48

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 8: శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ప్రారంభం సందర్భంగా భక్తకన్నప్ప ధ్వజారోహణం జరిగింది. గురువారం మధ్యాహ్నం అర్జునుడి ఉత్సవ మూర్తిని శివాలయానికి సమీపంలో ఉన్న కన్నప్ప కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడున్న ధ్వజస్తంభం వద్ద అర్చకులు పూజలు నిర్వహించారు.

02/09/2018 - 02:46

గాజువాక, ఫిబ్రవరి 8: పొత్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టబోమని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గురువారం గాజువాకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై స్పందించారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర సంక్షేమమే ముఖ్యమని, దీనికి విఘాతం కలిగించే విధంగా ఉండే పొత్తులు తమకు అవసరం లేదని చెప్పారు.

02/09/2018 - 02:45

విజయవాడ, ఫిబ్రవరి 8: లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో ఏపీకి సాయం గురించి ప్రస్తావించకపోవడం బాధ అనిపించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంతి (హోం) చినరాజప్ప వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో గురువారం మాట్లాడుతూ ప్రధాని ప్రసంగంపై చర్చ జరుగుతోందన్నారు.

Pages