S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/06/2018 - 03:17

విజయవాడ, ఫిబ్రవరి 5: చలనచిత్ర రంగానికి ఇక గుడ్‌బై చెపుతూ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లో రాజకీయ అరంగ్రేటం చేసిన జనసేన నేత పవన్ కల్యాణ్‌కు తన తొలి ప్రయత్నంలోనే చుక్కెదురైంది. ఆయన తన తొలి రాజకీయ యాత్ర రాజధాని నుంచే ప్రారంభించాలని మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో సర్వే నెంబర్ 181/182 పరిధిలోని మూడెకరాల భూమిలో ఎంతో అట్టహాసంగా భారీఎత్తున సభ నిర్వహించారు.

02/06/2018 - 03:15

విజయవాడ, ఫిబ్రవరి 5: అటవీ, పర్యావరణ పరిరక్షణకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. సోమవారం వెలగపూడిలోని తన కార్యాలయంలో తనను కలిసిన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ అటవీ నర్సరీలను వనమిత్ర పేరుతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 20 నర్సరీలను గుర్తించామని, వీటిని సుమారు రూ.3కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

02/06/2018 - 03:14

విజయవాడ, ఫిబ్రవరి 5: ‘ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తున్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి’ అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్కు స్టాక్ ఎక్సేంజ్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ఎక్సేంజ్ గ్రూపు ప్రెసిడెంట్ టామ్ ఫార్లే, టెక్నాలజీ హెడ్ అట్లూరితో సమావేశమయ్యారు.

02/06/2018 - 03:14

విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర పురపాలక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 14 నగర పాలక సంస్థలు, 4 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. క్యాంటీన్ల ఏర్పాటుపై అధికారుల బృందం కర్నాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీల్లో పర్యటించి అధ్యయనం చేసింది.

02/06/2018 - 03:13

విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.9,847 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.5,348 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

02/06/2018 - 03:12

విజయవాడ, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి నియంత్రణా ప్రాధికార సంస్థ (ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ) వెబ్‌సైట్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి, ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కరికల్ వలవన్ సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఇక రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు తమ ప్రాజెక్టులను ఏపీ రెరా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

02/05/2018 - 01:15

అమరావతి, ఫిబ్రవరి 4: బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రకు జరిగిన అన్యాయానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ కఠిన నిర్ణయం తీసుకోనుందన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతానికి అంతర్గతంగానే వ్యక్తం చేస్తున్న ఆందోళనను, రేపటి నుంచి పార్లమెంటులో బహిరంగంగానే వినిపించాలని, విడతల వారీగా వత్తిడి తేవాలని ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం తీర్మానించింది.

02/05/2018 - 01:12

విజయవాడ, ఫిబ్రవరి 4: విద్యుత్ రంగంలో ఆంధ్ర ‘పవర్’ చాటాలని, దేశంలోనే నెంబర్ వన్‌గా నిలపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపబోనన్న హామీని నిలబెట్టుకున్నానని, తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రంగాలవారీగా భవిష్యత్ విద్యుత్ అవసరాలను అంచనావేసి, అందుకనుగుణంగా సరఫరాకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

02/04/2018 - 03:48

విజయవాడ, ఫిబ్రవరి 3: ఉండవల్లి వచ్చిన కుప్పం నియోజకవర్గ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుప్పం ఎంపీపీ కె.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలువురు నియోజకవర్గ ప్రజలు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రత్యేక బస్సులో పోలవరం ప్రాజెక్టుకు వెళ్తూ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. గుంటూరులో వివిధ కార్యక్రమాలు ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రిని కుప్పం వాసులు కలుసుకున్నారు.

02/04/2018 - 03:46

విశాఖపట్నం, ఫిబ్రవరి 3: కేంద్రంలో ఎన్‌డిఏ కూటమి బలంగా ఉందని, దీనికి ఎటువంటి డోకాలేదని రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి పైడికొండ మాణిక్యాలరావు అన్నారు. విశాఖ నగర శివారు ప్రాంతంలో ఉన్న వైజాగ్ కనె్వక్షన్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ఫోటోట్రేడ్ షోను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రైల్వేజోన్‌కు సంబంధించి సాంకేతిక ఇబ్బందులున్నాయని చెప్పారు.

Pages