S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/28/2017 - 03:25

ఐరాల, ఆగస్టు 27: చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు నెమలి వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవానికి కాణిపాకం, చినకంపల్లి, కొత్తపల్లి, చిగరపల్లి, అగరంపల్లి, వడ్రంపల్లి, దామరగుంట, కురపుపల్లి గ్రామాల రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా దర్శనానికి అనుమతి ఇచ్చారు.

08/28/2017 - 03:24

అనంతపురం, ఆగస్టు 27 : ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో అనంతపురం జిల్లాలో ఏర్పడిన తాగునీటి ఎద్దడి నివారణకు హెచ్‌ఎల్‌సికి నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు తుంగభద్ర బోర్డు అధికారులను కోరారు. మంత్రి కాలవ ఆదివారం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయాన్ని, హెచ్‌ఎల్‌సి కాలువను పరిశీలించారు.

08/28/2017 - 03:21

కడప, ఆగస్టు 27 : రాయలసీమ జిల్లాల్లో ఆలస్యంగా వర్షాలు కురుస్తున్నాయని దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు రైతాంగానికి వంద శాతం సబ్సిడీతో ఉచితంగా విత్తనాలు సరఫరా చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే రైతు రుణమాఫీ కింద మూడవ విడతలో రూ. 3,600 కోట్లను త్వరలో విడుదల చేస్తామన్నారు.

08/28/2017 - 03:21

కాకినాడ, ఆగస్టు 27: సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధిచెప్పాలని కాకినాడ ఓటర్లకు వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏడాదిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు చంద్రబాబే చెప్పారని, ఏడాది తర్వాత వచ్చేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమని, టిడిపికి ఓటు వేస్తే ఆ ఓటు మురిగిపోతుందన్నారు.

08/28/2017 - 03:19

కాకినాడ, ఆగస్టు 27: ‘హర్యానాలో డేరా బాబా.. ఆంధ్రాలో జగన్ బాబా ప్రజలను రెచ్చగొట్టి, అరాచకాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నవారంతా భూకబ్జాదారులు, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నవారేనన్నారు. ఓటు అనే ఆయుధంతో వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

08/28/2017 - 02:58

విజయవాడ, ఆగస్టు 27: ‘ఉప రాష్టప్రతికి కొన్ని పరిమితులున్నాయనేది ఎవరూ మరువరాదు.. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సమస్యలపై అవకాశం ఉన్నంతమేర స్పందిస్తూనే ఉంటా’ అని ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరగబోతోందని గుర్తించే తాను రాజ్యసభలో నాడు గట్టిగా పోరాడి విభజన చట్టంలో అనేక హామీలు సాధించానని చెప్పారు.

08/28/2017 - 02:56

ప్రత్తిపాడు/ కిర్లంపూడి, ఆగస్టు 27: మెరుపు ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి అదే పంథాను అనుసరించారు. గత నెల రోజులుగా చలో కిర్లంపూడి పేరుతో పాదయాత్ర నిర్వహించడానికి ప్రయత్నిస్తూ, పోలీసులు అడ్డుకుంటుండటంతో తన ఇంటివద్దే రకరకాలుగా నిరసనలకు దిగుతున్న ఆయన ఆదివారం ఉదయం అనూహ్యంగా రోడ్డెక్కేశారు.

08/28/2017 - 02:51

న్యూఢిల్లీ, ఆగస్టు 27: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాడం సరికాదని ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ (ఎఐడిఆర్‌ఎఫ్) స్పష్టం చేసింది. ఎఐడిఆర్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు మాట్లాడుతూ, టిడిపి ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్ని హరించడమే అవుతుందని విమర్శించారు.

08/28/2017 - 02:47

రాజమహేంద్రవరం, ఆగస్టు 27: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని నిలువరించడం పోలీసులకు పెద్ద కష్టం కాదు. సంయమనం పాటిస్తున్నాం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఆయనపై చర్యలు తీసుకోకతప్పదని ఆంధ్రప్రదేశ్ డిపిజి నండూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ముద్రగడపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చినట్టుగా కొన్ని చానళ్లలో వస్తున్నాయని, వాటిని ఖండిస్తున్నామన్నారు.

08/28/2017 - 01:46

హైదరాబాద్, ఆగస్టు 27: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పేరిట కొనసాగుతున్న పనులను విదేశీ సంస్థలకు అప్పగించడం సరికాదని, ఇది రాష్ట్రానికి తీరని అన్యాయం చేసే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ మాజీ ఛీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తాను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన 19లేఖను మీడియాకు విడుదల చేశారు.

Pages